Ads
ఇటీవలే అఖండ చిత్రంతో భారీ సక్సెస్ సాధించారు బాలకృష్ణ. బాలకృష్ణ నటించిన ప్రాజెక్టుగా ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం NBK 107. ఇది బాలకృష్ణ 107 వ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.
Video Advertisement
ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించనుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు.
ఈ చిత్రంలో శాండిల్ వుడ్ హీరో దునియా ఫేమ్ విజయ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల అయ్యిపోయింది. అలానే బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ని కూడా విడుదల చేశారు. అదే విధంగా ఈ సినిమాలో యాక్షన్ ఉంటుందిట. ఎమోషన్స్ కూడా ఎక్కువ వుంటాయని టాక్. అలానే సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉండనుంది. వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య సోదరిగా నటించనుంది.
ఇదిలా ఉంటే బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో NBK 108 రానుంది. ఈ సినిమాలో మిడిల్ ఏజ్డ్ మనిషి లాగ నటించనున్నారు బాలయ్య. అయితే భారీగా పారితోషకం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య 108 వ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు గాను రూ.25 కోట్లు పారితోషికం తీస్తుంటున్నట్టు తెలుస్తోంది.
బాలయ్య ఎప్పుడు కూడా రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేసింది లేదు. బాలయ్య తన నాన్న గారి లానే ఉంటారట . ఎప్పుడు కూడా రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేసింది లేదుట. ఇక ఇదిలా ఉంటే సీనియర్ హీరోలలో మెగా స్టార్ చిరంజీవి మాత్రమే రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే రెమ్యునరేషన్ అందరు ఒకేలా తీసుకోరు. ఒక్కో నటులు ఒక్కో విధంగా డిమాండ్ చేస్తారు.
End of Article