Ads
ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల పైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంతకుముందు కూడా మూడు పెళ్లిళ్ల విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పలువురు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద విమర్శలు చేశారు.
Video Advertisement
తాజాగా ఈ విషయం పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. పవన్ కళ్యాణ్‌ను విమర్శించడానికి వేరే కారణం లేనందువల్లే పదే పదే ఆయన పెళ్లిళ్ల పై, భార్యల పై కామెంట్లు చేస్తున్నారు అంటూ వీడియో ద్వారా స్పందించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. అయితే బండ్ల గణేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను దైవంగా భావిస్తారు. ఆ విషయాన్ని పలు ఈవెంట్స్ లో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ తాజాగా వార్తల్లో నిలిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శల పై స్పందిస్తూ సోషల్ మీడియా ఎక్స్ లో వీడియోని పోస్ట్ చేశారు.
ఆ వీడియోలో ” నమస్కారం, నిన్నటి నుంచి మనసులో ఒకటే వేదన, ఒకటే బాధ, ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే, నా బతుకు ఎందుకా? అని నాకే అనిపిస్తుంది. చిరాకు వేస్తోంది. నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టుడు, దైవసమానులు అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. సార్ మీరు పెద్ద హోదాలో ఉన్నారు. భగవంతుడు మీకు అద్భుతమైన హోదాను ఇచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి నేను, మీకు చెప్తాను.
నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు, దశాబ్దాల పాటు ఆయనతో తిరుగుతున్నాను. ఆయన చాలా నిజాయితీపరుడు, నీతివంతుడు. ఎవరు కష్టాల్లో ఉన్నా, ఆ కష్టం నాదే అని ముందుకెళ్ళే వ్యక్తి, భోళా మనిషి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడుతున్నారు. జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి. అది కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే, అని నేను భావిస్తున్నాను. ఉరికురికే అదొక్కటే రీజన్, మరొకటి లేదా, పదే పదే అదే విషయం మాట్లాడటం, చాలా బాధ పడుతూ చెప్తున్నాను. మీకు విన్నవిస్తున్నాను.
పవన్ కళ్యాణ్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి. దేశం కోసం బతుకుతున్న మనిషి. ఏ రోజు స్వార్ధంతో కానీ, స్వలాభంతో కానీ ఏ పని చేయడు, అలా మాట్లాడటం కానీ, ఆయన మాటల్లో, చేతల్లో కానీ చూడలేదు. హాయిగా షూటింగ్‌లు చేసుకుంటూ, సూపర్ స్టార్ హోదాను అనుభవిస్తూ, హాయిగా బ్రతకండి అని చెబుతూండేవాన్ని.వెయ్యేళ్లు బ్రతుకుతామా, మనం పోయినా కూడా జనం మనల్ని గుర్తుపెట్టుకోవాలని, జనానికి ఏదైనా చేయాలని అనేవారు. ఆయన ఆలోచనలన్నిటిని నీతిగా, నిజాయితీగా అడుగాడుగు పేర్చుకుంటూ, భరిస్తూ, సహిస్తూ తలవంచుకుని జనం కోసం బ్రతకాలని, రాత్రిపగలు కష్టపడుతున్నాడు.
నిస్వార్ధంగా కష్టపడుతున్నాడు. రాత్రిపగలు షూటింగ్స్ చేసి ఆయన సంపాదించిన డబ్బుని పార్టీకి ఖర్చు పెడుతున్నాడు. ఎవరి దగ్గరా, ఏ విధంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, పార్టీని నడుపుతున్న మహానుభావుడు. దయచేసి, ఒక్కసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏమిటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా, కష్టంలో ఉన్నా అంటే సహాయం చేస్తాడు. ఆయనకు లేనిది ఒకటే కులాభిమానం. భారతీయులంతా ఒక్కటే, మనం మనుషులం, మనుషులుగానే బ్రతకాలని చెప్పేవారు.
ఆయనకు గాని కుల పిచ్చి ఉంటే నన్ను ఆదరించేవాడా? నాకీ హోదా ఇచ్చేవాడా? నేను అనుభవిస్తున్న ఈ స్టేటస్ మొత్తం ఆయన పెట్టిన భిక్షే. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, దయచేసి, తెలిసి తెలియకుండా, పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని, మనసున్న వ్యక్తి పై అభాండాలు వేయకండి. నేను జనసేన వ్యక్తిని కాదు, కార్యకర్తని కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిని, పవన్ కళ్యాణ్ నిర్మాతని, పవన్ కళ్యాణ్ మనిషిని” అంటూ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
@ganeshbandla pic.twitter.com/SIgrryzDUw
— devipriya (@sairaaj44) October 13, 2023
Also Read: “బాలకృష్ణ” తో జత కట్టిన ఈ 13 మంది హీరోయిన్స్ కి… బాలకృష్ణకి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..?
End of Article