అంతరిక్షం లోకి వెళ్లబోయే బండ్ల శిరీష కి, మన బండ్లన్న కి లింక్ ఏంటబ్బా..? ఆ ట్వీట్ కి అర్ధమేంటో..?

అంతరిక్షం లోకి వెళ్లబోయే బండ్ల శిరీష కి, మన బండ్లన్న కి లింక్ ఏంటబ్బా..? ఆ ట్వీట్ కి అర్ధమేంటో..?

by Anudeep

Ads

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా లో ట్వీట్లు, యూట్యూబ్ లలో ఇచ్చే ఇంటర్వ్యూ లతో బండ్ల గణేష్ తరచూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. తాజాగా.. త్వరలోనే అంతరిక్షం వెళ్ళబోతున్న బండ్ల శిరీష కు శుభాభినందనలు చెబుతూ బండ్లన్న చేసిన ట్వీట్ ట్రేండింగ్ లో ఉంది. ఇంతకీ ఈ ట్వీట్ ఇంత ట్రెండ్ అవటానికి కారణం ఏంటో తెలుసుకుందాం రండి..

Video Advertisement

sireesha

ఈ నెల 11 వ తేదీన అంతరిక్ష నౌక అయిన “యూనిటీ -22 ” ను ప్రయోగించబోతున్నట్లు అమెరికా కు చెందిన స్పేస్ సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నౌక లో స్పేస్ లో కి వెళ్లబోయే బృందం లో ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు కు చెందిన బండ్ల శిరీష కూడా ఉన్నారు. తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి ఆస్ట్రోనాట్ గా స్పేస్ లోకి వెళ్తుండడం తో.. తెలుగు వారంతా గర్వం గా ఫీల్ అవుతున్నారు.

bandla ganesh

ఈ విషయమై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా ట్వీట్ చేసారు. “మా బండ్ల ఫామిలీ మరో ఘనత సాధించినందుకు చాలా గర్వం గా ఉంది” అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేయడం తో ట్విట్టర్ లో రచ్చ నెలకొంది. ఈ విషయానికి సంబంధించి అనేక కథనాలను కూడా బండ్లన్న పంచుకోవడం తో.. నెటిజన్లు కూడా రెస్పాండ్ అవుతున్నారు. బండ్ల శిరీష మీ చెల్లా..? అంటూ పలువురు నెటిజన్లు బండ్లన్నను ప్రశ్నిస్తున్నారు. నిజంగానే శిరీష బండ్ల గణేష్ కు బంధువా లేక ఒకటే ఇంటిపేరు అవడం వలన ఆయన ఇలా పోస్ట్ చేశారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

bandla tweet


End of Article

You may also like