తింటునంతసేపు “ఇస్తరాకు” అంటారు. తిన్నాక “ఎంగిలాకు” అంటారు!

తింటునంతసేపు “ఇస్తరాకు” అంటారు. తిన్నాక “ఎంగిలాకు” అంటారు!

by Anudeep

Ads

అప్పటికి సరిగ్గా ఒక 10 సంవత్సరాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తన రేంజ్ కి తగ్గ సినిమా రాలేదు..2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ పవర్ స్టార్ స్టామినా ని చూపించిన సినిమా…ఈ సినిమాని హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా బండ్ల గణేష్ నిర్మించారు …ఇటీవలే ఆ సినిమా విడుదల అయ్యి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులని గుర్తు చేసుకుంటూ దర్శకుడు హరీష్ శంకర్ ఒక లెటర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.ఐతే ఆ లెటర్ లో నిర్మాత బండ్ల గణేష్ పేరు ని మరచిపోయారు..మరుసటి రోజే ఇంకో ట్వీట్ లో బండ్ల పేరు ని జోడించి ట్వీట్ చేసారు.పొరపాటు జరిగిందంటూ వివరణ ఇచ్చుకున్నారు.మరి అటు తరువాత బండ్ల గణేష్ స్పందిస్తూ .’కేవలం అతనొక రీమేక్ డైరెక్టర్ మాత్రమే అతనికి లైఫ్ ఇచ్చింది నేనే అంటూ బండ్ల చెప్పుకొచ్చాడు’

Video Advertisement

https://twitter.com/ganeshbandla/status/1260939052611596288

.మరి ఈ ట్వీట్ కి ప్రతిస్పందనగా ఎవరు ఎవరికి లైఫ్ ఇచ్చారో అంటూ కౌంటర్ ఎటాక్ చేసాడు.డైరెక్టర్ హరీష్. తాజాగా బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూ లో హరీష్ శంకర్ ప్రస్తావన రాగా భవిష్యత్ లో హరీష్ తో సినిమాలు చేసే ప్రసక్తే లేదు అంటూ తేల్చేసారు…మొత్తానికి వీరిరువురి వాగ్వాదాలు చూస్తుంటే..ఈ గొడవ ఇప్పటి కాదేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.మొత్తానికి ఈ గొడవ కాస్త ఆగిపోవాలి అంటే పవర్ స్టార్ ఎంట్రీ ఇవ్వక తప్పదేమో..అన్నమాటలు వినిపిస్తున్నాయి..

 


End of Article

You may also like