Ads
ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని సినిమాలు వెనకడుగు వేశాయి. బంగార్రాజు మాత్రం మొదటి నుండి సంక్రాంతి బరిలోనే ఉంది. పైగా చెప్పినట్టుగానే సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది.
Video Advertisement
కథాపరంగా చూస్తే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి, బంగార్రాజు సినిమాకి పెద్ద తేడా కనిపించదు. స్టోరీ లైన్ దాదాపు అలాగే ఉంది. కానీ హీరో హీరోయిన్లని మార్చడం వల్ల కొంచెం కొత్తగా అనిపించింది. ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణన్, క్రితి శెట్టి బాగా నటించారు.
బంగార్రాజు సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం నాగార్జున. కొద్ది సంవత్సరాల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనాలో నాగార్జున నటన చాలా మందికి నచ్చింది. నాగార్జున అంత యాక్టివ్ గా చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. దాంతో మళ్లీ బంగార్రాజు పాత్రతో నాగార్జున తెరపై కనిపిస్తే చూడడానికి చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అయితే ఈ సినిమాలో ఒక సీన్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అది ఏంటంటే, ఒక సీన్ లో, నాగ చైతన్యకి, ఎద్దుకి మధ్య ఒక ఫైట్ ఉంటుంది.
అక్కడే నుంచొని ఇదంతా చూస్తున్న బంగార్రాజు ఆత్మ ఎద్దుని, “బసవ” అని పిలవగానే ఆ ఎద్దు బంగార్రాజు వైపు చూస్తుంది. బంగార్రాజు “మనవడే వదిలేసేయ్” అనంగానే ఆ ఎద్దు నాగ చైతన్యని వదిలేస్తుంది. ఒక ఎద్దు జీవితకాలం 20 సంవత్సరాలు. బంగార్రాజు చనిపోయి అప్పటికే దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. “అసలు ఎద్దు బతికేది 20 సంవత్సరం అయితే, ఇంకా ఎలా ఉంది? అసలు ఈ సీన్ ఎలా తీస్తారు?” అని కామెంట్స్ చేస్తున్నారు.
End of Article