Ads
ఓ బ్యాంకు ఉద్యోగి ఎప్పటిలానే పొద్దునే ఆఫీస్ కు వెళ్ళాడు. అప్పటికే తలుపులు తాళం తీసి ఉండడం చూసి.. రోజులానే మేనేజర్ తమకంటే ముందే అక్కడకి వచ్చి తాళాలు ఓపెన్ చేసి ఉంటారని ఉహించాడు. రోజులానే మాములుగా లోపలకి వెళ్ళాడు. కానీ, లోపల చూసాక షాక్ అయ్యాడు.
Video Advertisement
image credits: newindianexpress
ఆ బ్యాంకు మేనేజర్ లోపల ఓ ఇనుప కొక్కానికి ఉరి వేసుకుని కనిపించే సరికి నిర్ఘాంత పోయాడు. వెంటనే ఆమెను కిందకు దించి.. ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ, అతని ప్రయత్నం వృధానే అయింది. ఆమె అప్పటికే మరణించింది. ఈ దుర్ఘటన కేరళ రాష్ట్రము లో చోటు చేసుకుంది. న్యూస్ 18 కథనం ప్రకారం కేరళలో కన్నూర్ వద్ద తొక్కిలంగడిలోని కెనరా బ్యాంకు బ్రాంచ్ కు కె ఎస్ స్వప్న అనే మహిళ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఎంతో నిక్కచ్చి గా ఉండే మనిషి. విధుల నిర్వహణ లో కూడా ఆమె ఎంతో బాధ్యతాయుతం గా ఉంటారు.
image credits: iraysmedia
ఆమె పట్ల ఇతర బ్యాంకు సిబ్బంది కూడా ఎంతో గౌరవం గా, అభిమానం గా ఉంటారు. ఏడాది క్రితమే ఆమె భర్త మరణించడం తో.. ఆమె మానసికం గా చాలా కృంగిపోయింది. తిరిగి మామూలు మనిషి కాలేకపోయింది. ఉద్యోగం లో కూడా లాంగ్ లీవ్ తీసుకుంది. బంధువులు, సన్నిహితులు ఆమెను తిరిగి ప్రోత్సహించడం తో ఆమె తిరిగి ఉద్యోగం లో చేరింది.
అయినప్పటికీ భర్తను మరచిపోలేక అన్యమస్కం గా ఉండేది. ఇటీవల శుక్రవారం రోజులానే బ్యాంకు కు వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. తండ్రి మరణించి, తాజాగా తల్లి కూడా ఆత్మహత్య చేసుకోవడం తో వారి పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటనతో బ్యాంకు ఉద్యోగులు హతాశులయ్యారు. స్థానికం గా విషాదం నెలకొంది. స్వప్న ఆత్మహత్య చేసుకోవడం సిసి కెమెరాలలో కూడా స్పష్టం గా రికార్డు అవడం తో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.
End of Article