బర్రెలక్కది ప్రేమ వివాహమా..? పెద్దలు కుదిర్చిన వివాహమా..? పెళ్లయ్యాక రాజకీయాల్లో కొనసాగుతారా..?

బర్రెలక్కది ప్రేమ వివాహమా..? పెద్దలు కుదిర్చిన వివాహమా..? పెళ్లయ్యాక రాజకీయాల్లో కొనసాగుతారా..?

by Mohana Priya

Ads

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన బర్రెలక్క అలియాస్ శిరీష పెళ్లి ఇటీవల ఘనంగా జరిగింది. మార్చి 28వ తేదీన తన స్వస్థలంలోనే పెళ్లి జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియాలో కూడా తర్వాత చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో మందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని కూడా బర్రెలక్క షేర్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే బర్రెలక్క ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు.

Video Advertisement

barrelakka husband educational qualification

కొంత కాలం క్రితం తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఎంగేజ్మెంట్ అయినట్టు ప్రకటించారు. సడన్ గా ఎంగేజ్మెంట్ జరగడంతో ఎవరిని పిలవలేకపోయాను అని, సారీ అని చెప్పారు. ఎంగేజ్మెంట్ కి సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేశారు. తర్వాత తన భర్తని పరిచయం చేస్తూ ఒక ఫోటోషూట్ వీడియో షేర్ చేశారు. బర్రెలక్క పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు వెంకటేష్. వెంకటేష్ నాగర్ కర్నూల్ ప్రాంతానికి చెందినవారు. అయితే, వీరిది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. బర్రెలక్కను కూడా ఈ విషయం మీద చాలా మంది అడిగారు.

barrelakka love story and career after marriage

దాంతో ఈ విషయం మీద మాట్లాడారు బర్రెలక్క. తనది పెద్దలు కుదిర్చిన వివాహం అని చెప్పారు. వెంకటేష్ తనకి తెలిసినవారు అని, దగ్గర బంధువు అని అన్నారు. అలా వీరి పరిచయం ఏర్పడింది అని చెప్పారు. అయితే, పెళ్లికి ముందు బర్రెలక్క రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు పెళ్లయ్యాక రాజకీయాల్లో పాల్గొంటారా అని అందరూ అడుగుతున్నారు. ఇందుకు కూడా బర్రెలక్క సమాధానం చెప్పారు. పెళ్లవుతుంది కాబట్టి, ఎంపీగా పోటీ చేస్తారా, లేదా ఆపేస్తారా అని తనని అందరూ అడిగారు అని చెప్పారు. తన భర్తకి కూడా రాజకీయాలు అంటే ఆసక్తి ఉంది అని, పెళ్లి అయ్యాక ఇద్దరు కలిసి ఎంపీ పదవికి పోటీ చేస్తాం అని బర్రెలక్క స్పష్టం చేశారు.

watch video :

ALSO READ : కాలి బొటన వేలు కంటే రెండో వేలు పొడుగ్గా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా.?


End of Article

You may also like