కాలి బొటన వేలు కంటే రెండో వేలు పొడుగ్గా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా.?

కాలి బొటన వేలు కంటే రెండో వేలు పొడుగ్గా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా.?

by Harika

Ads

సాధారణం గా నడక, తీరు తెన్నులను బట్టి కొందరు మనిషిని చూసి లక్షణాలు చెప్పేయగలుగుతుంటారు. అలానే, చేతి రేఖలను బట్టి కూడా వీరు ఇలా ఉంటారు.. వీరి లక్షణాలు ఈ విధం గా ఉంటాయి అని చెప్పగలుగుతుంటారు.

Video Advertisement

అలానే, అమ్మాయిల కాలి వేళ్ళను బట్టి వారు ఏ విధం గా నడుచుకుంటారు, ఏ విధం గా ప్రవర్తిస్తారు..? వారిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న విషయాలను కూడా కొందరు చెబుతుంటారు. అవేంటో, ఇప్పుడు చూద్దాం.

ladies foot fingers

అమ్మాయిల కాలి బొటన వేలి కంటే.. పక్కన ఉన్న వేలు పొడుగు ఎక్కువ గా ఉంటె.. వారు చాలా తెలివైన వారు గా ఉంటారట. అలానే, వారు ఎక్కువ గా క్రియేటివ్ గా పని చేస్తారట. మిగతా వేళ్ళ కంటే బొటన వేలు పొట్టి గా ఉన్న అమ్మాయిలైతే ఎన్ని పనులను అయినా., ఏ పని అయినా సునాయాసం గా చేసేస్తారట. అదే బొటన వేలు పక్కన వేలు మిగతా అన్ని వేళ్ళ కంటే పొడవు గా ఉంటె కనుక, అలాంటి అమ్మాయిలలో లీడర్ షిప్ క్వాలిటీస్ ఉంటాయట. ఎలాంటి సమస్య ఎదురైనా ముందుండి నడిపించగలుగుతారట.

second toe

వారు డైనమిక్ గా ఉండడం తో పాటు, ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు. అదే కాలి రెండో వేలు అన్ని వేళ్ళ కంటే పొట్టి గా ఉంటె.. అలాంటి అమ్మాయిలు బాగా కలివిడి గా ఉంటారట. అందరితో బాగా కలిసిపోతూ, నవ్వుతు ఉంటారట. అదే కాలి మొదటి మూడు వేళ్ళు సమానం గా ఉండి, చివరి రెండు వేళ్ళు చిన్న గా ఉంటె.. ఈ అమ్మాయిలు చాలా దృఢం గా ఉంటారట.

ladies toes

కాలి వేళ్ళ లో నాలుగు సమానం గా ఉండి చివరి వేలు చిన్న గా ఉన్న అమ్మాయిలు కుటుంబానికి అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తారట. అదే అన్ని వేళ్ళు పొడుగు గా ఉండి నాలుగో వేలు పొట్టి గా ఉంటె, ఇలాంటి అమ్మాయిలకు ఫ్యామిలీల పట్ల, రిలేషన్ షిప్ల పట్ల పెద్ద గా ఆసక్తి ఉండదట. అందరు ఇలానే ఉంటారని కాదు. జనరల్ గా ఇలాంటి గుర్తుల ద్వారా కొన్ని విషయాలను అంచనా వేసి చెబుతూ ఉంటారు అంతే.


End of Article

You may also like