BARRELAKKA: పట్టువదలని బర్రెలక్క.. లోక్‌సభ బరిలోకి..! ఎంపీగా ఎక్కడినుండి పోటీ చేయనున్నారంటే.?

BARRELAKKA: పట్టువదలని బర్రెలక్క.. లోక్‌సభ బరిలోకి..! ఎంపీగా ఎక్కడినుండి పోటీ చేయనున్నారంటే.?

by Mounika Singaluri

Ads

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసి ఒక్కసారిగా అందరూ తన వైపు చూసేలా చేసిన బర్రెలక్క అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఎన్నికలలో ఆమె కి వచ్చిన పాపులారిటీ అంతా కాదు మేధావులు సైతం ఆమె గెలుస్తుందనే అనుకున్నారు కానీ అనూహ్యంగా ఆమె ఓడిపోవడం జరిగింది. అయితే ఏమాత్రం నిరాశ చెందకుండా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వచ్చే లోక్స సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానంటూ ప్రకటించింది బర్రెలక్క అలియాస్ కర్నే శిరీష. డిగ్రీ చదువుకున్నా బర్రెలు కాసుకున్నాను అంటూ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి వైరల్ అయింది ఈ బర్రెలక్క.

Video Advertisement

పోటీ పరీక్షలు రాసి విసిగిపోయి, ఎన్నికలలో పోటీ చేసి గెలిచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని భావించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకి ప్రత్యర్థిగా నిలబడిన బర్రెలక్క ఓటమిపాలైంది. ఆమెకి మొత్తం 6000 ఓట్లు దక్కాయి. ఓటమి విషయంలో కాస్త నిరాశపాలైన తన పట్టుదల మాత్రం వీడలేదు బర్రెలక్క.

ఇప్పుడు ఆమె లోక్ సభ బరిలోకి దిగుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది తాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని నాగర్ కర్నూల్ నుంచి ఎంపీ తో పాటు ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతానని, గెలిచే వరకు పోటీ చేస్తూనే ఉంటానని నిరుద్యోగుల కోసం గళం ఎత్తుతానని చెప్పుకొచ్చింది. ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏదైనా చేయగలదని ప్రపంచానికి చాటి చెబుతాను అంటుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆచితూచి అడుగులు వేస్తానని చెప్తుంది.

బర్రెలక్క కి సోషల్ మీడియాలో ఉన్న ప్లాట్ ఫామ్ లో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అలాగే కంచే ఐలయ్య, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు కూడా బర్రెలకు సపోర్ట్ చేస్తున్నారు. ఆర్థికంగా కూడా చాలామంది విరాళాలు ఇచ్చారు.అయినా కూడా ఎంపీగా విజయం సాధించాలంటే గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఎలాంటి ప్రణాళికల తో ముందడుగు వేస్తుందో వేచి చూడాల్సిందే.


End of Article

You may also like