Beast Review : బీస్ట్ తో “విజయ్” పాన్ ఇండియన్ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Beast Review : బీస్ట్ తో “విజయ్” పాన్ ఇండియన్ హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

  • చిత్రం : బీస్ట్
  • నటీనటులు : విజయ్, పూజా హెగ్డే, సెల్వరాఘవన్.
  • నిర్మాత : కళానిధి మారన్
  • దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్
  • సంగీతం : అనిరుధ్ రవిచందర్
  • విడుదల తేదీ : ఏప్రిల్ 13, 2022

netizens angry on thalapathy vijay

Video Advertisement

స్టోరీ :

సినిమా జోధ్ పూర్ లో మొదలవుతుంది. మిషన్ లో ఉన్న స్పెషల్ ఏజెంట్ వీర రాఘవ (విజయ్)ని పరిచయం చేస్తారు. వీర రాఘవకి ఒక హై ప్రొఫైల్ మిషన్ అప్పగిస్తారు. ఇదే వీర రాఘవ మొదటి మిషన్. ఉమర్ ఫారూఖ్ అనే వ్యక్తిని పట్టుకునే పనిని వీర రాఘవకి అప్పగిస్తారు. వీర రాఘవ ఈ పని చేస్తాడు కానీ ఈ క్రమంలో ఒక పిల్ల ప్రాణాలు పోతాయి. కొన్ని నెలల తర్వాత ఈస్ట్ కోస్ట్ మాల్ ని హైజాక్ చేస్తారు. అక్కడున్న వారందరినీ బంధించి ఉమర్ ఫారూఖ్ ని విడుదల చేయమని అడుగుతారు. కానీ ఆ మాల్ లో వీర రాఘవ ఉంటాడు. వీర రాఘవ ఏం చేశాడు? అక్కడున్న వారందరినీ కాపాడాడా? ఈ హైజాక్ లో ఏ ప్రమాదం జరగకుండా వీర రాఘవ ఎలాంటి ప్లాన్ చేశాడు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

netizens angry on thalapathy vijay

రివ్యూ :

తలపతి విజయ్ తెలుగులో కూడా గత కొన్ని సంవత్సరాల నుండి చాలా ఫేమస్ అయ్యారు. స్నేహితుడు సినిమా తర్వాత నుండి విజయ్ నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా తమిళ్ లో విడుదలైన రోజే విడుదల అవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు బీస్ట్ కూడా అలాగే విడుదల అయ్యింది. మాస్టర్ సినిమాతో విజయ్ తెలుగువారికి ఇంకా చేరువయ్యారు. నెల్సన్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన వరుణ్ డాక్టర్ సినిమా కూడా తెలుగులో హిట్ అయ్యింది. దాంతో విజయ్, నెల్సన్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది అంటే ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ సినిమా అనుకున్నంత స్థాయిలో లేదు అని చెప్పాలి. నెల్సన్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఏదో తక్కువగా అనిపిస్తుంది. ఒక పెద్ద స్టార్ హీరోతో సినిమా చేస్తున్న కారణంగా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

beast movie review

దాంతో నెల్సన్ సినిమాలకి మెయిన్ హైలైట్ అయిన కామెడీ ఈ సినిమాలో మిస్ అయ్యింది. యాక్షన్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తి కూడా ఎక్కువగా ఉండదు. మొదటి హాఫ్ చాలా డల్ గా నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా స్పీడ్ పెరుగుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ బాగా నటించారు. ఒక ఏజెంట్ పాత్రలో కరెక్ట్ గా సరిపోయారు. మిగిలిన పాత్రల్లో నటించిన పూజా హెగ్డే, దర్శకుడు సెల్వరాఘవన్, యోగి బాబు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం అనిరుధ్ అందించిన సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ముఖ్యంగా అరబిక్ కుతు పాట అయితే వినడానికి చూడడానికి కూడా చాలా బాగుంది. కానీ కథని హ్యాండిల్ చేయడంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సినిమా మరొక స్థాయిలో ఉండేదేమో.

ప్లస్ పాయింట్స్ :

  • విజయ్
  • యాక్షన్ సీన్స్
  • అక్కడక్కడా వర్కౌట్ అయిన కామెడీ
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • బలహీనమైన కథనం
  • ఎమోషన్స్ లేకపోవడం
  • సాగదీసిన కొన్ని సీన్స్

రేటింగ్ :

2/5

ట్యాగ్ లైన్ :

ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏదో ఒక సినిమా చూద్దాం, లేదా పాటలు, విజయ్ కోసం సినిమా చూద్దాం అని అనుకొని వెళ్ళిన వారికి అయితే బీస్ట్ ఒకసారి చూడొచ్చు.


End of Article

You may also like