BEFORE MARRIAGE: డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తున్న బిఫోర్ మ్యారేజ్ మూవీ…!

BEFORE MARRIAGE: డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తున్న బిఫోర్ మ్యారేజ్ మూవీ…!

by Harika

Ads

తెలుగులో ప్రతి సంవత్సరం కొన్ని డిఫరెంట్ జానర్ సినిమాలు వస్తున్నాయి. ఒక మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు ఎప్పటికీ ఆదరణ లభిస్తూ ఉంటది. ఇప్పుడు అలాంటి ఒక డిఫరెంట్ సినిమా ఒకటి వస్తుంది…అదే బిఫోర్ మ్యారేజ్. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయితే వచ్చే సమస్యలను ఈ మూవీలో చూపిస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు.

Video Advertisement

ఈ చిత్రంలో భరత్, నవీన రెడ్డి ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. సృజన ఆర్ట్స్ బ్యానర్ పైన జగదీశ్వర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం యూత్ ఫుల్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, గత ఏడాది వచ్చిన బేబీ మూవీ ఇందుకు నిదర్శనం అని అన్నారు. అలాగే ఈ సంవత్సరం చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ కూడా భారీ విజయం సొంతం చేసుకుందని, అదే రేంజ్ లో తమ సినిమా బిఫోర్ మ్యారేజ్ కూడా ప్రేక్షకులు ఆదరణ పొందుతుందని అన్నారు.

లైఫ్ లో తాత్కాలిక ఆనందం కోసం క్షణకాలంపాటు చేసిన తప్పు జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందని యథార్థ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని.. యూత్ అందరికి ఈ సినిమా విపరీతంగా నచ్చుతుందని తెలిపారు. మంగ్లీ పాడిన ఒక పాట సినిమాకి హైలెట్ గా నిలబడుతుందని నిర్మాత జగదీశ్వర్ రెడ్డి తెలియజేశారు.


End of Article

You may also like