Ads
కరోనా ఉధృతి రోజురోజుకీ పెరిగిపోతుండడం పైగా వర్షా కాలం కావడంతో చాలామంది జనాలు జలుబు,దగ్గు,తుంపరలతో ఇబ్బంది పడుతున్నారు.పక్కన వాళ్ళ ఇంటికి బయట నుండి ఎవరైనా వస్తానే భయపడిపోతున్న జనం ఇక పక్కన వాళ్ళు తగ్గిన,తుమ్మినా కూడా అనుమానంగా చూస్తున్నారు.ఇక ఈ జలుబు,దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారికి ప్రస్తుతం డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయట్లేదు కాని టెస్ట్ చేయించుకోమని సలహా ఇస్తున్నారు.ఇక ఈ వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలకు ఇంటి వద్ద యూకలిప్టస్ నూనెతో ఓ చక్కని పరిష్కారం లభిస్తుంది.
Video Advertisement
ఇక ఈ యూకలిప్టస్ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
*వర్షా కాలంలో ఎక్కువగా నీళ్లలో కాళ్ళు తడవడం వల్ల కాళ్ల పగుళ్లు, ఇన్ఫెక్షన్లు వంటివి వస్తాయి. వీటి నుండి ఉపశమనం పొందడం కోసం కొబ్బరినూనెలో రెండు చుక్కల యూకలిప్టస్ నూనెను కలిపి రోజూ రాత్రి పూట అరికాళ్ళు అంతా రాసుకుని సాక్సులు వేసుకుని పడుకుంటే మీకు ఈ సమస్య నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది
*ఇక జలుబుతో ఇబ్బంది పడుతున్నవారు మూడుచుక్కల యూకలిప్టస్ నూనెను సాధారణ కొబ్బరి నూనెతో కలిపి ఆ ద్రవాన్ని ఛాతీకి, ముక్కుకు రాసుకుని పడుకుంటే ప్రయోజనం కనిపిస్తుంది.ఇక అతితెలివికి పోయి ఎవరైనా యూకలిప్టస్ నూనెను శరీరం పై నేరుగా రాసుకొంటే దాని ఘాటుకు మీ చర్మం కందిపోతుంది.
*ఒళ్లు నొప్పులూ, మెడనొప్పి, కండరాలు పట్టేయడం వంటివి సమస్యలతో బాధపడుతున్న వారు. బాదం నూనెలో రెండు చుక్కల యూకలిప్టస్ నూనెని కలిపి నొప్పి ఉన్న చోట ఆ మిశ్రమాన్ని రాసి మర్దన చేస్తే ఫలితం కనిపిస్తుంది.
*జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు మరిగే నీళ్లల్లో యూకలిప్టస్ నూనెని మూడు చుక్కలు చేర్చి ఆవిరి పడితే రొంప, ముక్కు కారడం వంటివి తగ్గిపోతాయి.
End of Article