Ads
దేశంలో ఎంతో మంది ప్రజలు ఉంటారు. ఒక రంగంలో కూడా ఎంతో మంది ప్రముఖులు ఉంటారు. కానీ కొంత మంది ఉంటారు. వారు తమ పని చేస్తున్న వృత్తికే అందం తీసుకొస్తారు. వారి వల్ల వారి వృత్తి అభివృద్ధి చెందేలాగా చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వారు తమ గుర్తింపుని చాటి చెప్పుకుంటారు.
Video Advertisement
అలాంటి వారిని భారతదేశ ప్రభుత్వం అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంది. అలా ఎంతో గొప్ప వారికి ఇచ్చిన అవార్డుల్లో, పద్మ అవార్డులు ఒకటి. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పేరుతో అవార్డులు ఉంటాయి. ఇటీవల పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.
సినిమా రంగంలో చిరంజీవి చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. ఇంకా చాలా మంది సినీ, ఇతర రంగాలకి చెందిన ప్రముఖులకి ఈ పద్మ అవార్డులు ప్రకటించారు. మరి కొద్ది రోజుల్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది. అయితే ఈ అవార్డుల వల్ల ఏమైనా లాభాలు ఉంటాయా అనే ప్రశ్న చాలా మందికి నెలకొంది. కానీ నిజం ఏంటంటే, ఈ అవార్డులు కేవలం గౌరవం కోసం మాత్రమే ఇస్తారు. వీటికి ఎటువంటి డబ్బులు లభించవు. అలాగే ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రత్యేకమైన సదుపాయాలు కూడా ఉండవు. అంతే కాకుండా వారికి ఏమీ ప్రత్యేకమైన అధికారాలు కూడా ఉండవు.
ఇది కేవలం వారు వారి వృత్తిలో చేసిన కృషిని గుర్తించి, అందుకు తగిన ప్రతిఫలంగా ఇచ్చే అవార్డులు మాత్రమే. ఈ అవార్డులు వచ్చిన వారు పుస్తకాల మీద కానీ, లెటర్ హెడ్ ల మీద కానీ, లేదా మరి ఎక్కడైనా బ్యానర్ల మీద కానీ ఈ పేరుని వారి పేరుకి ముందు చేర్చి వాడకూడదు. ఇది కేవలం వారి గుర్తింపు కోసం ఇచ్చే అవార్డు మాత్రమే అని వారు దృష్టిలో పెట్టుకోవాలి. అంతే కాకుండా ఈ అవార్డుకి అలాంటిదే మరొక డూప్లికేట్ అవార్డు కూడా ఇస్తారట. ఇది ఆ అవార్డు అందుకున్న వాళ్లు ఏదైనా వేడుకల్లో కానీ, లేదా రాష్ట్రానికి సంబంధించిన ఫంక్షన్స్ లో కానీ ధరించవచ్చు. కానీ ఇతర లాభాలు మాత్రం కలుగవు.
End of Article