లాక్ డౌన్ వేళ గర్భిణీ కష్టం…7 కిలోమీటర్లు నడిచి చివరికి డెంటల్ క్లినిక్ లో..!

లాక్ డౌన్ వేళ గర్భిణీ కష్టం…7 కిలోమీటర్లు నడిచి చివరికి డెంటల్ క్లినిక్ లో..!

by Anudeep

Ads

లాక్ డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . మరీ ముఖ్యంగా గర్భిణులకు ఇది ఒక రకంగా కష్టకాలమే . మంత్లీ చెకప్ కి వెళ్లడానికి ఇబ్బంది, నెలలు నిండుతూ ప్రసవానికి దగ్గర పడుతుంటే ఒకవైపు డెలివరి గురించి టెన్షన్, మరోవైపు పరిస్థితి ఎలా ఉంటుందో అనే మరో ఇబ్బంది.. ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంది బెంగుళూర్లో ఒక జంట.. ప్రసవం కోసం ఏడు కిమీ లు నడిచిన ఉపయోగం లేకపోయింది. చివరికి డెంటల్ హాస్పిటల్లో డెలివరి అయింది.

Video Advertisement

నార్త్ బెంగళూరుకి చెందిన ఒక కార్మికుడు తన భార్య కు నెలలు నిండట తో ప్రసవం చేయించడానికి హాస్పిటల్ కోసం తిరిగాడు.సుమారు ఏడు కిలోమీటర్లు నడిచాడు. ఎక్కడ ఏ హాస్పిటల్ తెరచిలేదు.ఒకవైపు భార్యకు నొప్పులు ఎక్కువ కావడంతో దగ్గరలోని   ఓ డెంటల్ హాస్పిటల్ కి వెళ్లి తన భార్యకి డెలివరి చేయాల్సిందిగా అక్కడ డాక్టర్స్ ని అడిగాడు.ముందు డెలివరి చేయడానికి నిరాకరించిన, గర్భిణి పరిస్థితి గమనించిన అక్కడి మహిళాడాక్టరులు ప్రసవం చేయడానికి అంగీకరించారు.

అప్పటికే ఆమె  పరిస్థితి విషమం గా ఉండడంతో, చేసేదేం లేక ప్రసవం చేయడానికి ప్రయత్నించారు డాక్టర్లు. మొత్తానికి డెలివరి చేసి బిడ్డను బయటకి తీసారు. కాని పాపలో ఎటువంటి చలనం లేదు. దాంతో చనిపోయిందనే నిర్దారణకి వచ్చారు. కనీసం తల్లినైన రక్షించాలని అనుకున్నారు.అప్పటికే తల్లికి తీవ్ర రక్తస్రావం అయి ఉండడంతో ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తుంటే ..హఠాత్తుగా పాపలో చలనం వచ్చింది. దాంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

“ఆమె పరిస్థితి చూసి డెలివరి చేయాల్సి వచ్చింది. కానీ మొదట పాపలో కదలిక లేకపోయేసరికి కొంచెం బాధ కలిగింది . పాప చనిపోయిందనుకున్నాం, కాని కాసేపటికి పాపలో కదలిక చూసేసరికి చాలా సంతోషం అనిపించింది” అని డెలివరి చేసిన డాక్టర్  రమ్య అన్నారు. తర్వాత ఇద్దరినీ బెంగళూరు ప్రభుత్వాసుపత్రి కి తరలించారు. ప్రస్తుతం తల్లి , బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.


End of Article

You may also like