Ads
సాధారణంగా పబ్లిక్ ప్రదేశాల్లో కానీ, లేదా పబ్లిక్ వాహనాల్లో కానీ కొన్ని పనులు చేస్తే జరిమానా విధించడం అనేది సహజమైన విషయమే. అందుకే చాలా పబ్లిక్ ప్రదేశాల్లో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు తీసుకోవద్దు అని రాసి ఉంటుంది.
Video Advertisement
అయితే ఇటీవల ఒక వ్యక్తి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయిన మెట్రోలో చేసిన ఒక పని వల్ల అతనికి 500 జరిమానా పడింది. జరిమానా పడింది అంటే అతను ఏదో తప్పు పని చేశాడు అనుకుంటే పొరపాటే. అతను ఆహారం తీసుకున్నాడు అంతే. అది కూడా మంచూరియా.
బెంగళూరులో మెట్రోలో ఒక వ్యక్తి గోబీ మంచూరియా తింటున్నాడు. ఇది సోషల్ మీడియాలోకి వచ్చింది. ఈ వీడియోలో అతను తింటూ ఉంటే, అతని చుట్టుపక్కన వాళ్ళు అది తప్పు అని చెప్తున్నారు. అయినా కూడా అతను వినిపించుకోలేదు. ఇలా మెట్రోలో ఆహారం తీసుకోవడం అనేది బెంగళూరు మెట్రో నియమాల ప్రకారం చట్ట పరంగా నేరమే అయినా కూడా అంతకుముందు ఎవరికీ జరిమానా విధించలేదు.
ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత యాజమాన్యం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని నిర్ణయించుకుంది. దాంతో అతనికి 500 రూపాయలు జరిమానా విధించింది. ఈ సంఘటన జయా నగర్, సంపంగి రోడ్ స్టేషన్ మధ్యలో జరిగింది. జయ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వ్యక్తి మీద కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అంతే కాకుండా నియమాలు అధిగమించినందుకు అతనికి జరిమానా కూడా వేశారు. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఇతని పేరు కుమార్ అని తెలుస్తోంది.
ఇతనికి పెనాల్టీ వేయడం మాత్రమే కాకుండా, ఇలాంటి పని ఇంకొకసారి చేయను అని అర్థం వచ్చేలాగా ఒక అండర్ టేకింగ్ ఫామ్ రాయించి దానిమీద సంతకం కూడా పెట్టించుకున్నారు. అయితే ఇలాంటిది మొదటి సారి ఏమీ కాదు. అంతకుముందు కూడా ఒక యూట్యూబర్ ఇలాగే టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడు అని వీడియో తీసి పెట్టాడు. ఆ తర్వాత అతని మీద బెంగుళూరు మెట్రో యాజమాన్యం కేస్ కూడా ఫైల్ చేశారు. ఇప్పుడు ఇలాంటి సంఘటన కూడా బయటికి రావడంతో, ప్రజలు ఇలాంటి నియమాలని ఇంకా గట్టిగా పాటిస్తున్నారు.
watch video :
This was the video he had circulated earlier on social media which got hin into trouble pic.twitter.com/UQ8lnFExft
— S. Lalitha (@Lolita_TNIE) October 5, 2023
ALSO READ : పెళ్లి కార్డులో ఇలాంటి వివరాలు కూడా పెడతారా..? ఈ వెడ్డింగ్ కార్డ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
End of Article