బీటెక్/ డిగ్రీ తర్వాత ఏంటి ? చాలా మంది యువత లో ఉన్న ప్రశ్న ఇదే

బీటెక్/ డిగ్రీ తర్వాత ఏంటి ? చాలా మంది యువత లో ఉన్న ప్రశ్న ఇదే

by Megha Varna

Ads

బీటెక్ చేసిన వారైనా డిగ్రీ చేసిన వారైనా తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలి కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్ బీటెక్ చేసిన డిగ్రీ పూర్తి చేసిన మొదటగా మీ ఆసక్తి దేనిలో ఉన్నది అనే ఈ విషయంలో క్లారిటీ కి రండి,

Video Advertisement

1.ఒకవేళ మీకు ఇంకా చదువు పట్ల ఆసక్తి ఉన్నట్లయితే ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలి అని అనుకున్నట్లయితే మీరు ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ చేయవచ్చు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో మంచి ర్యాంకు తో క్వాలిఫై అయినట్లయితే ఎమ్మెస్సీ లేదా ఎంటెక్ చదివే సమయంలో ప్రభుత్వం భారీ మీకు 15 నుండి 40 వేల వరకు మీరు ఎంచుకున్న కాలేజ్ని బట్టి స్టైఫండ్ రూపంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దీని తరువాత ఇంకా చదువుకోవాలనే ఆసక్తి ఉన్నట్లయితే మీరు పీహెచ్డీ చేయొచ్చు, పీహెచ్డీ చేసే సమయంలో కూడా ప్రభుత్వం వారు ముప్పై నుండి నలభై వేల వరకూ స్టైఫండ్ రూపంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎంఎస్సీ, ఎంటెక్, పీహెచ్డీ అనగా సబ్జెక్టులో ఇంకా లోతైన విశ్లేషణ చేయడం అని అర్థం ఇలా చేయడం వల్ల నీకు సబ్జెక్ట్ గురించి పూర్తి అవగాహన వస్తుంది దీనితో పాటుగా మీకు పీహెచ్డీ పూర్తయిన వెంటనే మీ చేతిలో జాబ్ కి సంబంధించిన ఆఫర్ లెటర్స్ సిద్ధంగా ఉంటాయి, పీహెచ్డీ చేసిన వాళ్లకు మన దేశంలో డిమాండ్ చాలా ఎక్కువగానే ఉంది నెలకు ఇంచుమించు 60 వేల నుండి స్టార్టింగ్ శాలరీ ఉండొచ్చు.

2. ఒకవేళ మీకు ఇంకా చదవడం ఇంట్రెస్ట్ లేదు ఏదైనా ఉద్యోగం లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మీకు రెండు రకాల మార్గాలు ఉన్నాయి 1 గవర్నమెంట్ జాబ్స్ ప్రతి సంవత్సరం ssc, బ్యాంక్, యూపీఎస్సీ, గ్రూప్స్ కి సంబంధించి నోటిఫికేషన్లు పడుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి జాబ్స్ కి కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న కారణం చేత వీటిలో జాబ్ కొట్టాలి అంటే మీరు ఒకటి నుండి రెండు సంవత్సరాలు వీటి ప్రిపరేషన్ కోసం టైమ్ని కేటాయించవలసి ఉంటుంది. ఇంకా రెండవ మార్గం ప్రైవేట్ జాబ్స్, ఒకవేళ మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే దీనికోసం కూడా అనేక రకమైన సాఫ్ట్వేర్ కోర్సులు మనకి నేర్పించే ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకూ అందులో కోచింగ్ తీసుకొని ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వడం ద్వారా జాబ్ ని సంపాదించే అవకాశం ఉంది

3. ఒకవేళ జాబ్ కోసం తిరగాల్సిన అవసరం మీకు లేదు మీ దగ్గర ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టేందుకు కావలసిన డబ్బులు మీ దగ్గర ఉన్నాయి అనుకున్నట్లయితే ముందుగా ఆ బిజినెస్ గురించి తగిన వివరాలు అన్నీ తెలుసుకొని, ఆ బిజినెస్ చేసే వాళ్ల దగ్గర నుండి మీకు కావలసిన అనుభవాన్ని సంపాదించుకొని అప్పుడు సొంతంగా స్టార్ట్ చేయడం బెటర్, బిజినెస్ పెట్టినప్పటికీ మీరు మొదటి 3 సంవత్సరాలు చాలా కష్టపడాల్సి ఉంటుంది తరువాత మాత్రమే మీరు లాభాలు పొందగలరు


End of Article

You may also like