Ads
సినిమాల్లో పాటలు, డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ తో పాటు మరొక ముఖ్యమైనది ఎలివేషన్స్. అది కూడా కమర్షియల్ సినిమాల్లో ఎలివేషన్స్ ఎంత బాగుంటే సినిమా కూడా అంత హిట్ అవుతుంది.
Video Advertisement
గత కొంత కాలం నుండి చాలా కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి వాటిలో ఎలివేషన్స్ కూడా సినిమాకే హైలైట్ అవుతున్నాయి. అలా ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు ఏవో వాటిలో హైలైట్ అయిన ఎలివేషన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 భీమ్లా నాయక్
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి వచ్చే ప్రతి ఎలివేషన్ హైలైట్ అయ్యింది.
#2 కేజీఎఫ్
అసలు ఎలివేషన్ అంటే ముందుగా గుర్తొచ్చే సినిమా కేజీఎఫ్. మొదటి పార్ట్ లో మాత్రమే కాకుండా సెకండ్ పార్ట్ లో కూడా అదే రేంజ్ లో ఎలివేషన్స్ ఉన్నాయి.
#3 పుష్ప
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో కూడా ఎలివేషన్స్, ఫైట్స్ సినిమాకి హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా తగ్గేదే లే మేనరిజం అయితే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.
#4 ఆర్ఆర్ఆర్
ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకటి కాదు రెండు కాదు సినిమా మొత్తంలో హైలైట్ అయిన ఎలివేషన్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఫైట్ చేయడం అనేది ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. దాంతో సినిమా ఇంకా పెద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా వచ్చే సీన్ ఒక హైలైట్ అయ్యింది.
#5 అఖండ
అఖండ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎలివేషన్ సీన్స్ చాలా హైలైట్ అయ్యాయి. సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఇవి ఒక ముఖ్య పాత్ర పోషించాయి.
#6 ఆర్ఆర్ఆర్
ఇందులో ఫస్ట్ హాఫ్‌లో కొమరం భీమ్ ఒక పెద్ద వాన్‌లో వచ్చే సీన్ చూసి ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఇలాంటి సీన్ తెలుగు సినిమాల్లో చూడడం చాలా అరుదుగా జరుగుతుంది.
ఇవన్నీ మాత్రమే కాకుండా కొద్ది సంవత్సరాల క్రితం వచ్చిన బాహుబలి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ, ప్రభాస్ హీరోగా నటించిన సాహోతో పాటు ఇంకా చాలా సినిమాల్లో ఎలివేషన్ సీన్స్ హైలైట్ అయ్యాయి.
End of Article