“చంటబ్బాయి” సినిమాతో పాటు… “చిరంజీవి” కెరీర్‌లో “బెస్ట్ సినిమా” అనిపించుకున్న 12 సినిమాలు ఇవే..!

“చంటబ్బాయి” సినిమాతో పాటు… “చిరంజీవి” కెరీర్‌లో “బెస్ట్ సినిమా” అనిపించుకున్న 12 సినిమాలు ఇవే..!

by kavitha

Ads

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్ల నుండి అగ్ర హీరోగా రాణిస్తున్నారు. 60 ఏళ్లు దాటినా యంగ్  హీరోలకు ఏమాత్రం తగ్గకుండా నటిస్తున్నాడు. చిరంజీవి కుమారుడు హీరోగా సినిమాలు చేస్తున్నా, ఆయన కంటే ఎక్కువ జోష్ తో చిరంజీవినే ముందుకెళ్తున్నాడు.

Video Advertisement

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి, స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగారు. ఆయన కెరీర్ లో నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. చిరంజీవి కెరీర్ లో నటించిన ఉత్తమ చిత్రాలు ఏమిటో  ఇప్పుడు చూద్దాం..
1. రుద్రవీణ:

చిరంజీవి, శోభన జంటగా నటించిన సినిమా రుద్రవీణ. ఈ చిత్రానికి కె.బాలచందర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి.
rudraveena2. స్వయంకృషి:

చిరంజీవి హీరోగా కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమా స్వయంకృషి. ఈ మూవీలో హీరోయిన్ గా విజయశాంతి నటించింది.  3. ఆపద్బాంధవుడు:

చిరంజీవి, మీనాక్షి శేషాద్రి జంటగా నటించిన ఆపద్బాంధవుడు సినిమాకి కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వం చేశారు.  ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కానప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిరంజీవికి ఉత్తమ నటుడిగా నాంది అవార్డ్ వచ్చింది.
4. చంటబ్బాయి:

చిరంజీవి, సుహాసిని జంటగా నటించిన ఈ మూవీకి జంధ్యాల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రైవేటు డిటెక్టివ్‌గా చిరంజీవి నటించాడు. 5. విజేత:

చిరంజీవి, భానుప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన విజేత చిత్రాన్ని ఎ. కోదండరామి రెడ్డి తెరకెక్కించారు. అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.
6. జగదేక వీరుడు అతిలోక సుందరి:

చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఈ సోషియో ఫాంటసీ మూవీని కె. రాఘవేంద్ర రావు తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అపుర్వమైన విజయాన్ని అందుకుంది.
7. ముఠా మేస్త్రి:

చిరంజీవి హీరోగా,  రోజా, మీనా హీరోయిన్లుగా నటించిన ముఠామేస్త్రీ మూవీకి ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా, చిరంజీవికి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది.
8. సైరా:

చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ మూవీని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తమన్నా, నయనతార హీరోయిన్లుగా నటించారు.9. ఇంద్ర:

చిరంజీవి హీరోగా ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించిన ఇన్ద్ర మూవీని బి గోపాల్  తెరకెక్కంచారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. చిరంజీవి టాప్ 10 సినిమాలలో ఇది ఒకటి.
10. అభిలాష:

చిరంజీవి, రాధిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని యండమూరి వీరేంద్రనాథ్ రాసిన అభిలాష అనే నవల ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీకి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.
11. ఛాలెంజ్:

చిరంజీవి, సుహాసిని, విజయశాంతి నటించిన ఈ చిత్రానికి  కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా, యండమూరి వీరేంద్రనాథ్ కథను అందించారు.
12. యముడికి మొగుడు:

చిరంజీవి ద్విపాత్రాభినయం చేయగా రాధ, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు.
Also Read: “చిరంజీవి, బాలకృష్ణ” లు… “రజనీకాంత్, కమల్ హాసన్” ని చూసి నేర్చుకుంటే బాగుంటుంది అనుకుంటా..?


End of Article

You may also like