ANCHOR ANASUYA: అనసూయ పడిన కష్టాల గురించి బయటపెట్టిన రచయిత..ఆ టాక్ షో చేసిన సమయంలో.?

ANCHOR ANASUYA: అనసూయ పడిన కష్టాల గురించి బయటపెట్టిన రచయిత..ఆ టాక్ షో చేసిన సమయంలో.?

by kavitha

Ads

యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర పలు షోలకు యాంకరింగ్ చేస్తూ,  మరో వైపు సినిమాలలో డిఫరెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Video Advertisement

యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటు ఫ్యామిలీని, ఇటు కెరీర్ ను బాలెన్స్ చేసుకుంటూ కొనసాగుతున్నారు. రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ ఇటీవల ఇచ్చిన ఒక  ఇంటర్వ్యూలో యాంకర్ అనసూయ గురించి వెల్లడించిన విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్, సినిమాలలో నటిస్తూ బిజీగా మారారు.  వరుసగా ఆఫర్స్ రావడంతో  వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూరాణిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అనసూయ లేటస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు నెట్టింట్లో ట్రోల్స్ కు గురి అయ్యి,  ఇబ్బందులు సైతం పడ్డారు. రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ ఒక ఇంటర్వ్యూలో అనసూయ గురించి మాట్లాడుతూ,  ‘అలీ టాకీస్’ అనే టాక్ షో చేసే సమయంలో  అనసూయ పడిన కష్టాల గురించి వెల్లడించారు.

ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిన తరువాత నెక్ట్స్ ఎపిసోడ్‌కి రాత్రి ఏడు  గంటలకు వచ్చి అర్ధరాత్రి ఒకటి దాకా అనసూయ రిహార్సల్ చేసేదని అన్నారు. ఆ సమయంలో అనసూయ భర్త భరద్వాజ్ బయట కారులో ఎదురుచూసేవారని చెప్పారు. న్యూ షోకు టెస్ట్ షూట్ కోసం అన్ని ఫిక్స్ చేసుకున్నామని, కానీ షూటింగ్ కి 2  రోజుల ముందు ఆమె డెలివరీ అయ్యింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ డే  విశ్రాంతి తీసుకుని 3వ రోజు షూటింగ్ కి  వచ్చారని వెల్లడించారు.  షూటింగ్‌లో పాల్గొంటూనే  అరగంటకి ఒకసారి వెళ్ళి తన బిడ్డకి ఫీడింగ్ ఇస్తూ, షోకి యాంకరింగ్ చేసిందని, ఆ విధంగా ఎవరూ చేయలేరని చెప్పుకొచ్చారు.

ఆ ఒక్కరోజు షూటింగ్ లో పాల్గొన్నందుకు అనసూయ ఇప్పటి దాకా డబ్బులు కూడా అడగలేదని చెప్పారు. ఆల్టర్‌నేట్ అయినా చూసుకోమని చెప్పలేదని, ఆ సమయంలో వాళ్లింట్లో వాళ్లు అంగీకరించడం గ్రేట్ అని ప్రసన్న కుమార్ అన్నారు. నెట్టింట్లో చాలామంది అనసూయ గ్లామర్ చూసి ట్రోల్  చేస్తారని, ఆ కామెంట్స్ చూస్తే వారు చిన్నగా అనిపిస్తారని చెప్పుకొచ్చారు. అనసూయ లాంటి టఫ్ అమ్మాయిని ఇండస్ట్రీలో చూడలేదని, చాలా స్ట్రాంగ్ మహిళ అని చెప్పారు. ప్రస్తుతం ప్రసన్న కుమార్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Also Read: OORU PERU BHAIRAVAKONA COLLECTIONS: బ్రేక్ ఈవెన్ కి దగ్గర్లో ఉన్న ఊరి పేరు భైరవకోన..


End of Article

You may also like