భర్త చనిపోయినా రేఖ నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

భర్త చనిపోయినా రేఖ నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

by Anudeep

Ads

అప్పట్లో మిమిక్రి కళాకారులు సిని నటి జయంతిని అనుకరించడానికి ఒక డైలాగ్ చెప్తూ జనాల్ని ఎంటర్టైన్ చేసేవాళ్లు. ఆ డైలాగ్ ఏంటంటే “ఆడజన్మకి కావలసింది చిటికెడు కుంకుమ, డబ్బాడు పసుపండి అన్నట్టు..ఇంత ఆధునిక యుగంలో పెళ్లైనవాళ్లు, భర్త చనిపోయిన వాల్లు  ఇష్టం ఉంటే బొట్టు పెట్టుకుంటున్నారు. లేకపోతే లేదు…కాని మన సోషల్ మీడియా సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ మాత్రం వాటిని భూతద్దంలో పెట్టి చూపిస్తుంటారు.. సరే అవతల ఉన్నది సెలబ్రిటి కాబట్టి మనకి కూడా కొంచెం ఆసక్తి సహజం..ఇంతకీ విషయం ఏంటంటే.

Video Advertisement

భర్త చనిపోయినా రేఖ నుదుటిన సిందూరం ఎందుకు పెట్టుకుంటుంది? దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా ? అంటూ ఒక న్యూస్ వైరలవుతోంది..ఆవిడ ఎందుకు పెట్టుకుంటే మాకేంటయ్య అని కొందరు కొట్టిపారేస్తారు..మరికొందరు పెట్టుకుంటే పెట్టుకుంటుంది ఆవిడ ఇష్టం అని లైట్ తీస్కుంటారు.. కాని దీని వెనుక ఉన్న స్టోరీ అంటేనే కొందరికి ఆసక్తి కలుగుతుంది. బాలీవుడ్ విలన్ పునీత్ ఇస్సార్ భార్య రేఖ సిందూరం గురించి చెప్పిన స్టోరీ ఏంటంటే..

రేఖ, అమితాబ్ లు ప్రేమించుకున్న విషయం అందరికి తెలిసిందే. రేఖ మరో వ్యక్తిని , అమితాబ్ జయబచ్చన్ ని చేసుకున్నా వారిద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంది.. ఒకసారి షూటింగ్లో అమితాబ్ కి గాయం అయి మరణం అంచుల వరకు వెళ్లారు, అలా జరగడానికి రీజన్ నా భర్త పునీత్ అని రేఖకి నా భర్తంటే కోపం చాన్నాళ్లు తనతో మాట్లాడలేదు..చివరికి అమితాబ్ ఏదో సంధర్బంలో కలిసి షూటింగ్ అన్నాక ప్రమాదాలు సహజం అని చెప్తే తప్ప రేఖ కోపం చల్లారలేదు..తన సింధూరం పెట్టుకోవడానికి కారణం అమితాబ్ అని పునీత్ భార్య దీపాళీ ఏదో ఇంటర్వ్లో చెప్పారనేది విషయం..

సరే ఆవిడ చెప్పారు, వీళ్లు రాసారు.. కాని భర్త చనిపోతే పూర్తిగా అలంకరణకి దూరంగా ఉండి కేవలం తెల్లచీరలో మాత్రమే ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారు.. వారివారి స్థాయికి తగ్గట్టుగా కంటిన్యూ అవుతూనే ఉన్నారు.. రేఖ బొట్టుపెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి..అయినా దీపాళీ ఈ కామెంట్స్ చేసింది 2015లో..అవి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ గా మళ్లీ సోషల్ మీడియాలో వైరలవుతోంది. జనాలకు వైరల్ న్యూస్ , స్పైసీ న్యూసే కావాలని రాసేవాళ్లు, రాస్తున్నారు కాబట్టి చూస్తున్నాం అని జనం ఒకరిపై ఒకరు తోసేయడం తప్ప అసలు ఇలాంటి న్యూస్ మాత్రమే ఎక్కువ వైరలవడం వెనుక అసలు విషయం ఎప్పటికి అర్దం కాదు..సోషల్ మీడియాలో ఈ “వైరల్” ఫీవర్ కు విరుగుడు “పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి జరగదంటే…పెళ్ళి జరిగితే కానీ పిచ్చి ‌కుదరదు” అన్నంత కాంప్లికేటెడ్ గా కనబడుతోంది…


End of Article

You may also like