కుక్కకాటుకు చెప్పుదెబ్బ అనే నానుడికి ఆ దుబాయ్ ఇల్లాలు తనదైన స్టైల్ లో అర్దం చెప్పింది. .భర్త తనకు అనుకూలమైన చట్టాలను బాసటగా చేసుకుని రెండవ పెళ్లి కి సిధ్దమైతే…మొదటి భార్య అదే దేశ చట్టాలను ఆసరాగా చేసుకొని భర్తకు రివర్స్ టెండరింగ్ లో షాక్ ఇచ్చింది…ఈ భార్యాభర్తల టామ్ అండ్ జెర్రీ పంచాయతీ ఏమిటో ..భర్తకి షాక్ ఇచ్చేలా ఆ భార్య ఏం చేసిందో తెలియాలంటే..చదవాల్సిందే.!

దుబాయి లో జరిగిన ఘటన ఇది …భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకోవడానికి సిద్దపడ్డాడు ఒక ప్రభుద్దుడు..దాంతో ఎలా అయినా బుద్ది చెప్పలనుకున్న మొదటి భార్య.. ఒక ప్లాన్ వేసింది..భర్తకి సంబంధించిన ఒక వెహికిల్ ని తమ్ముడికి ఇచ్చి రాత్రంతా నీకు నచ్చినట్టు తిరగమని చెప్పింది.. ఓసోస్ ఇదేం ప్లాన్ అనుకుంటున్నారా..ఇక్కడే ఉంది అసలు తమాషా..! తమ్ముడికి బండి ఇచ్చి తిరగమని చెప్పింది..ఎడాపెడా ట్రాపిక్ రూల్స్ అతిక్రమించమని మరో ఫిటింగ్ పెట్టింది..

చేతికి బండి దొరికితే ఎవరైనా ఊరుకుంటారా.. అందులోనూ అడుగడుక్కి అడ్డుపడే ట్రాఫిక్ సిగ్నల్స్ తో చిరాకెత్తి ఉన్నవాళ్లు, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా పడితే అలా దాటే ఛాన్స్ వచ్చే ఎందుకు వదిలేస్తారు.. అక్క పావలా చేయమంటే తమ్ముడు రూపాయి చేసినట్టు..మనోడు రాత్రంతా బండి తీస్కుని ఇష్టం వచ్చినట్టు దుబాయి మొత్తం  తిరిగాడు..సిగ్నల్స్ జంప్ చేశాడు..రాంగ్ రూట్లో వెళ్లాడు.. ఒకటీ రెండేమిటి… మొత్తానికి అక్కా తమ్ముళ్లు కలిసి ఆ భర్తకి పెళ్లి గిఫ్ట్ ఇచ్చారు..

తెల్లారితే పెళ్లి అనగా ఆ కొత్త పెళ్లి కొడుక్కి మాంచి కిక్ ఇచ్చే గిఫ్ట్ అందింది.. అదేంటంటే ట్రాఫిక్ రూల్స్ అధిగమించినందుకు 50లక్షల జరిమానా… ఆ అని నోరు తెరవకండి.. అక్షరాలా యాభై లక్షలే…ఇంకేముంది భార్య రాక్స్… భర్త షాక్స్…

Sharing is Caring:
No more articles