లాక్ డౌన్ వేళ…భార్య పుట్టింట్లో చిక్కుకుందని…! ఆ భర్త ఏం చేసాడో తెలుసా?

లాక్ డౌన్ వేళ…భార్య పుట్టింట్లో చిక్కుకుందని…! ఆ భర్త ఏం చేసాడో తెలుసా?

by Anudeep

Ads

భార్య ఎడబాటు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.. నిజానికి ఈ ప్రపంచంలో మనిషిని మించిన వ్యసనం మరొకటి లేదు.ఒక మనిషి సానిహిత్యం మనకు వ్యసనంగా మారితే, ఆ మనిషితో విడదీయలేని బంధం ఏర్పడితే, ఆ మనిషిపై మానసికంగా డిపెండ్ అయితే ఇలాంటి పరినామాలే ఏర్పడతాయి.. ఆ సంఘటన వివరాలు..

Video Advertisement

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని  గోండాలోని రాధా కుంద్ ప్రాంతానికి చెందిన రాకేశ్ సోని వివాహితుడు, వయసు 32సంవత్సరాలు . రాకేశ్ సోనీకి భార్యంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమ వలనే భార్య ఎడబాటుని తట్టుకోలేక తన ప్రాణాన్ని బలి చేసుకున్నాడు. అనుకోకుండా పుట్టింటికి వెళ్లిన భార్య  లాక్ డౌన్ కారణంగా అక్కడే ఆగిపోవలసి వచ్చింది. రావడానికి ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో రాలేకపోయింది.దేశంలో పెరుగుతున్న కేసులు, నాయకుల మాటలు వింటుంటే లాక్ డౌన్ ఇప్పట్లో క్లోజ్ అయ్యేలా లేదు.. తన భార్యని ఇక కలుసుకోలేననుకున్నాడో ఏమో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ప్రాణాలొదిలాడు.

భార్య దగ్గర లేక‌పోవ‌డంతో ఒంటరి వాడిగా మారిన రాకేశ్ తనలో తానే కుమిలిపోయి, ఇక ఆ భాధని తట్టుకోలేక డిప్రెషన్లోకి జారుకున్నాడు.ఆమె లేకుండా జీవించ‌డం త‌న వ‌ల్ల కాద‌ని భావించిన రాకేశ్ భార్య ఎడబాటు భరించలేక ఉసురు తీసుకున్నాడు. భర్త మరణంతో కన్నీరు మున్నిరయింది రాకేశ్ భార్య. కాని ఇప్పుడు తను చేసిన పనివలన కుటుంబ సభ్యులు ఎవరూ చివరి చూపుకు కూడా నోచుకోలేని పరిస్థితి.

లాక్ డౌన్ కారణంగా ఒక్కొక్కరూ ఒక్కో రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నరు. కొందరు ఉపాధి కోల్పోతే , మరికొందరు తిండి లేక అలమటిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా చావుల కంటే ఆకలి చావులు, కష్టాల బాధ తట్టుకోలేని చావులు ఎన్ని చూడాల్సొస్తుందో..


End of Article

You may also like