భార్య “లూడో” ఆటలో ఓడించిందని కోపమొచ్చి… భర్త ఏం చేసాడో తెలుసా?

భార్య “లూడో” ఆటలో ఓడించిందని కోపమొచ్చి… భర్త ఏం చేసాడో తెలుసా?

by Anudeep

Ads

అష్టాచెమ్మా ఆడుదామంటే… కరోనా రావట్టే.. 31మందికి వచ్చిందని న్యూస్ చూసి దెబ్బకి అష్టాచెమ్మా బంద్.. పేకాట ఆడితే 39 మందికొచ్చిందని మరో వార్త.. ఓర్నాయనో ఈ ఆటలాడి ఆ మాయదారి రోగం తెచ్చుకునే కంటే ఎంచక్కా లూడో గేమ్ ఆడుకోవడం బెటర్ అనుకున్నారు చాలామంది.. కాని ఇప్పుడు ఈ న్యూస్ చూస్తే ఆ ఆట కూడా ఆడాలంటే భయపడతారు..

Video Advertisement

లాక్ డౌన్ ప్రకటించడంతో ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉంటు టివిలు చూసి, ఫోన్లల్ల తలలు పెట్టి , నిద్ర పోయి ఎన్ని పనులు చేస్తున్నా రోజులు భారంగా గడుస్తున్నాయి..దాంతో ఆ కాలపు ఆటలన్ని బయటికి తీసారు అష్టాచెమ్మా, వైకుంఠపాళి, లూడో , దాడి ఇలా తోచిన ఆటలన్ని ఆడుతున్నారు.. మన ఆటలల్ల మనం ఉంటే ఆ కరోనా దాని ఆటలల్ల అది ఉన్నది.. మంచిగ అందరిని క్వారంటైన్ కి పంపించింది.. కాని ఈ లూడో ఆడినోళ్ల కథ వేరే..

 

ఎటూ ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా లూడో ఆడుదాం రా అని భర్తని పిలిచింది గుజారాత్ లోని వడోదర కి చెందిన ఒక ఇల్లాలు.. పక్కింటోళ్లు ఇద్దరు, వీళ్లిద్దరూ నలుగురు ఆట షురూ చేసిర్రు..ఇంకేముంది ఎన్ని ఆటలాడినా భార్యనే గెలుస్తుంది.. గెలిచినోళ్లు ఏమన్నా ఊర్కుంటరా?  భర్తకి చిర్రెత్తుకొచ్చింది. పదేపదే పెళ్లాం చేతిలో ఓడిపోవడం అవమానం అనిపించింది..అంతే  భార్యతో గొడవకి దిగాడు, అది కాస్తా కొట్టుకునే వరకు పోయి..ఏకంగా ఆమె వెన్నెముక ఇరిగిపోయేంత వరకు దారి తీసింది.

వెంటనే హాస్పిటల్ కి తీస్కెళ్లారు, డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు..ఆమె భర్త మీద కేసు పెట్టింది..పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు.. ఆమె కేసు వాపస్ తీసుకుంది..వారు కలవడంతో మొత్తానికి కథ సుఖాంతం అయింది..వామ్మో ఈ కరోనా మామూలుది కాదు.. కరోనా సోకి కొందరు ప్రాణ భయంతో చస్తుంటే, మరికొందరు కరోనా ఎక్కడ సోకుతుందో అనే భయంతో చస్తున్నారు. ఈ రెండు కేటగిరిలకు చెందకుండా కొట్టుకు చచ్చేవాళ్లు కొందరు, లాక్ డౌన్ ముగిసేలోపు ఇంకెన్ని చూడాల్సొస్తుందో ఏంటో.

 


End of Article

You may also like