భార్య లేని సమయంలో కూతురుపై ఆ తండ్రి…చివరికి గర్భం దాల్చేసరికి ఏం చేసాడంటే?

భార్య లేని సమయంలో కూతురుపై ఆ తండ్రి…చివరికి గర్భం దాల్చేసరికి ఏం చేసాడంటే?

by Anudeep

Ads

కామంతో కళ్లు మూసుకు పోయిన వాడికి తల్లి, చెల్లి, బిడ్డా అనే తేడాలుండవు . ఆ క్షణానికి వాడి కోరిక తీరిందా లేదా అని చూస్తాడు . నూటికి తొంభై అత్యాచార కేసుల్లో దగ్గరి వారి చేతుల్లోనే ఆడపిల్లలు బలవుతున్నారనేది సర్వేలు తేల్చిన పచ్చి నిజం . ఆడపిల్లకి బయట రక్షణ లేదనుకుంటే, ఇంట్లోకాచుకూర్చునే మానవ మృగాల పరిస్థితి ఏంటి? కూతురిని, తండ్రే రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

Video Advertisement

నేపాల్ కి చెందిన ఒక వ్యక్తి గుజరాత్ లోని రాజ్కోట్ జిల్లా నవగమ్ కి వచ్చి స్థిరపడ్డాడు. అక్కడ ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేస్కోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆ మహిళకు అంతకుముందే పెళ్లి జరిగి మూడేళ్ల కూతురు ఉంది. భర్తతో విభేదాలు రావడంతో కూతురితో పాటు ఒంటరిగా జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో తనతో పాటుకూతురిని తన సొంత కూతురిలా చూస్కుంటానని చెప్పడంతో ఆ వ్యక్తితో వివాహానికి అంగీకరించింది.

పాప పెరిగి పెద్దదవుతుండడంతో ఆ కామాంధుడి కన్ను కూతురిపై పడింది. ఇంట్లో భార్య లేని సమయం చూసి సవతి కూతురిపై అత్యాచారానికి పాల్పడేవాడు. తల్లికి చెప్తే ఇద్దరిని చంపేస్తానని బెదిరించడంతో పాప రెండేళ్లుగా ఈ నరకం అనుభవిస్తూ వచ్చింది.

కొంతకాలంగా పాప స్తబ్దుగా ఉండడం గమనించిన తల్లి ,ఏం జరిగిందని ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పలేదు. క్రమంగా పాప ఆరోగ్యం క్షీణిస్తూ, నీరసంగా కనపడడంతో డాక్టర్ దగ్గరకు తీస్కువెళ్లింది. హాస్పటల్ కి వెళ్లిన తల్లికి పిడుగులాంటి వార్త చెప్పారు డాక్టర్లు. కూతురు నాలుగు నెలల గర్భవతి అని చెప్పడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. తర్వాత కూతురిని సముదాయించి నిజం చెప్పమని అడగడంతో అసలు విషయం చెప్పింది.

భర్తపై పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. వాడిని కఠినంగా శిక్షించి తీరాలని, తన కూతురిని సొంత కూతురిలా చూస్కుంటాడని నమ్మి  మోసపోయినందుకు, తన కూతురికి ఇన్నేళ్లపాటు నరకం చూపినందుకు వాడికి కచ్చితంగా కఠిన శిక్షపడాలని పోలీసులని వేడుకుంది.


End of Article

You may also like