విదేశాలకు వెళ్ళొచ్చారని భయపడి ఇంట్లో నుండి గెంటేశారు…హైదరాబాద్ లో దారుణం.!

విదేశాలకు వెళ్ళొచ్చారని భయపడి ఇంట్లో నుండి గెంటేశారు…హైదరాబాద్ లో దారుణం.!

by Anudeep

Ads

దేశంలో 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజులోనే ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో రోజురోజుకి పెరిగిపోతున్న భయాందోళనలు మానవత్వాన్ని చంపేస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వృద్ద దంపతులను ఇంటి నుండి గెంటివేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.

Video Advertisement

కరోనా వైరస్ ముఖ్యంగా ముసలివారికి, చిన్నపిల్లలకు వస్తుందనే నేపద్యంలో..కరోనా ఉందేమోననే అనుమానంతో ఇద్దరు ముసలివాళ్లని అపార్ట్ మెంట్ నుండి బయటికి పంపించివేశారు. హైదరాబాద్ నగరంలోని అల్వాల్ లో నివాసం ఉండే దంపతులిద్దరూ ఇటీవల విదేశాలకు వెళ్లి మూడు రోజుల క్రితం నగరానికి వచ్చారు. కరోనా వైరస్ ఎక్కువ గా విదేశాల నుండి వచ్చిన వారిలోనే బయటపడుతుంది కాబట్టి, వీళ్లిద్దరు కూడా విదేశాలనుండి వచ్చారనే భయంతో అపార్ట్ మెంట్ లో నివసించే వాళ్లంతా ఆ ముసలివాళ్లని అక్కడి నుండి వెళ్లిపోమని కోరారు.

వాళ్లు వినకపోవడంతో వెళ్లిపోవాల్సిందే అని ఒత్తిడి చేయడం స్టార్ట్ చేశారు. మా ఇంట్లో మేం ఉంటున్నాము, మేం అన్ని టెస్టులు చేయించుకునే వచ్చాం ఎందుకు వెళ్లిపోవాలని ఆ దంపతులు నిరాకరించారు. దాంతో అపార్ట్ మెంట్ వాసులు బలవంతంగా ఇద్దరిని బయటికి గెంటేశారు. అపార్ట్మెంట్ లో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. విషయం పోలీసుల వరకు వెళ్లిందా లేదా , తర్వాత ఏం జరిగింది అనే సమాచారం తెలియాల్సి ఉంది.

భయపడినంతా జరుగుతోంది. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే మనుషులు ఒకరికొకరు ధైర్యంగా నిలబడాల్సిందిపోయి. ఒకరిని చూసి ఒకరు భయపడే పరిస్థితి ఎదురవుతుంది. కేవలం మన నిర్లక్ష్యం మూలంగా ఎందరో ప్రాణాలను బలిచేయడం సరికాదు. ప్రభుత్వాలు చెప్తున్న సూచనలు పాటించండి. కొద్దిరోజులు సామాజిక జీవనానికి దూరంగా ఉండండి.

ముఖ్యంగా విదేశాల నుండి వచ్చేవాళ్లు వారి వారి వివరాలు వైద్యశాఖ అధికారులకు ఇవ్వండి. పూర్తి చెకప్ జరిగేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండు. విదేశాల నుండి వచ్చే వాళ్లలో కొంతమంది పారాసిటమాల్ వేసుకుని బాడీ టెంపరేచర్ కంట్రోల్ లో ఉండేలా చూస్కుంటున్నారనే వార్తల్లో మరింత కలవరపరుస్తున్నాయి. మన ఒక్కరి నిర్లక్ష్యం ఎంతో పెద్ద విపత్తు తీసుకురావొచ్చు. తస్మాత్ జాగ్రత్త!


End of Article

You may also like