కరోనా బాధితుడి భీభత్సం…రోడ్డుపై బట్టలు లేకుండా మహిళ మెడ కొరికేసి..!

కరోనా బాధితుడి భీభత్సం…రోడ్డుపై బట్టలు లేకుండా మహిళ మెడ కొరికేసి..!

by Anudeep

Ads

అనుకున్నంతా జరుగుతోంది.. కరోనా కేసులు ముదురుతుండడంతో ప్రజలు భయాందోళనలతో ఏం చేస్తారో అని భయపడినంతా జరుగుతోంది.. లాక్ డౌన్ నేపధ్యంలో ఏం చేయాలో పాలుపోక ఏం చేస్తారో అని టెన్షన్ పడినదంతా జరిగేలా ఉంది. మనుషులు ఉన్మాదుల్లా మారతారేమో అని అనుకున్నదంతా జరిగేలా ఉంది..ఈ వార్త చదివితే కరోనా కంట్రోల్ కాకపోతే మనుషుల పరిస్థితి ఏంటా అని మనకు వెన్నులో వణుకొచ్చేలా ఉంటుంది.

Video Advertisement

ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా ఆధినంలో ఉంది.దాంతో దేశాలన్ని లాక్ డౌన్ ప్రకటించుకుని ఎటూ కదలకుండా ఉన్నాయి. అమెరికా, ఇటలీ,  ఆస్ట్రేలియా అయితే ఏకంగా ఆరునెలలు లాక్ డౌన్ ప్రకటించింది. మన దేశం కన్నా ముందే శ్రీలంక లాక్ డౌన్ ప్రకటించేసింది. శ్రీలంకలో ఎక్కువగా నివసించేది మన తమిళ్ వాళ్లే..లాక్ డౌన్ ప్రకటించడంతో అందరూ సొంత ప్రాంతానికి వచ్చేశారు. శ్రీలంక నుండి వచ్చిన వారికి కూడా పరీక్షలు నిర్వహించి సీరియస్ గా ఉన్నవాళ్లకి ఐసోలేషన్ కి, మరికొంతమందిని హోం క్వారంటైన్ కి పంపించారు అధికారులు.

గతవారం శ్రీలంక నుండి తమిళనాడులోని థేని జిల్లకు వచ్చిన ముఫ్పై నాలుగేళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. లక్షణాలు మైల్డ్ గా ఉండడంతో సమస్య ఏం లేదని హోం క్వారంటైన్లో ఉండమని ఆదేశించారు.మనోడు ఒకట్రెండు రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత వింతవింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు అర్దరాత్రి ఒంటిపై బట్టల్లేకుండా వీధుల్లో తిరుగుతూ, ఒక ముసలమ్మ మెడ కొరకేశాడు.

వృద్దురాలి కేకలు వినపడడంతో చుట్టపక్కల వాళ్లు వచ్చి విడిపించి వాన్ని పోలీసులకి పట్టించారు. తొంభై ఏళ్ల ముసలమ్మ రక్తస్రావం ఎక్కువ జరగడంతో హాస్పిటల్ కి తీస్కెళ్లేలోపు చనిపోయింది.ఉన్మాదిలా ప్రవర్తించిన వాడికి ముందు నుండి మానసిక సమస్యలు ఉన్నాయిని చుట్టుపక్కలవారి సమాచారం. ఈ ఘటన అంతా చూస్తే ఐ యామ్ లెజెండ్ మూవీలో జాంబిస్ గుర్తొస్తున్నాయా?

ఐసోలేషన్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు.. ఒక్కరే ఒంటరిగా గడపాలి..అది నరకంలా ఉంటుంది. ఇక కరోనా లక్షణాలు ముదిరితే ఆ ఇబ్బంది మామూలుగా ఉండదు. సోషల్ డిస్టెన్సింగ్ ద్వారానే మనం కరోనాని జయించగలం. నిజానికి రోజు ఉరుకుల పరుగుల జీవితం గడిపిన మనిషి ఇప్పుడు ఒక్క దగ్గరే కట్టిపడేసినట్టు ఉండాలంటే ఇష్టపడడు. కాబట్టి వీలైనంతవరకు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఒత్తిడి కాలంలో మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి.


End of Article

You may also like