కారునే ఇంటిగా మార్చుకుని కొన్ని రోజులుగా అందులోనే ఉంటున్న డాక్టర్…రియల్ హీరో

కారునే ఇంటిగా మార్చుకుని కొన్ని రోజులుగా అందులోనే ఉంటున్న డాక్టర్…రియల్ హీరో

by Anudeep

తను ప్రాణాలు కాపాడే డాక్టర్ వృత్తిలో ఉన్నాడు.. తనని నమ్మి వచ్చిన పేషెంట్స్ ప్రాణాలు కాపాడడంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కూడా కాపాడుకోవడం ముఖ్యం అనుకున్నాడు. అందుకే కుటుంబానికి దూరంగా బతకడం కష్టం అయినప్పటికి ప్రాణం విలువ తెలిసినవాడు కాబట్టి ఇంటికి వెళ్లకుండా కారులోనే తన నివాసం ఏర్పరచుకున్నాడు.. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఒక రియల్ హీరో స్టోరీ.

Video Advertisement

సచిన్ నాయక్ , భోపాల్ లోని జేపి హాస్పిటల్లో డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ కరోనా బాదితులకు సేవలు అందిస్తున్నాడు. కరోనా పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ కి కా కరోనా సోకుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. ఈ నేపధ్యంలో తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయొద్దనుకున్నాడు సచిన్ నాయక్ . అందుకే కార్ లో తనకు కావలసిన నిత్యావసరాలను ఏర్పాటు చేసుకుని, కారునే ఆవాసంగా మార్చుకున్నాడు.

సచిన్ నాయక్ కి ముగ్గురు పిల్లలు . కరోనా బారిన పడేది ముఖ్యంగా చిన్నపిల్లలు ,ముసలివాళ్లే అనేది కూడా ఒక కారణం. తన పిల్లలకు దూరంగా ఉండడానికి ఇంతకంటే మరో మార్గం దొరకలేదు . సచిన్  కారులో పడుకుని పుస్తకం చదువుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీన్ని స్వయంగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ‘కోవిడ్ 19ను తరిమికొట్టేందుకు పోరాడుతున్న సైనికులు మీరు. మధ్యప్రదేశ్ ప్రజలందరి తరపున మీకివే మా ధన్యవాదాలు. ఈ యుద్ధం త్వరగా ముగియాలని, మనం విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో వైరలైన ఫోటోను చూసిన నెటిజన్లు సచిన్ నాయక్ పై ప్రశంసలు కురిపిస్తూన్నారు . అంతేకాదు డాక్టర్లు, ఇతర సిబ్బంది ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని వారికి వసతి సదుపాయం అవి కల్పిస్తే వారు మరింత ఉత్సాహంగా పని చేస్తారని కూడా కామెంట్ చేస్తున్నారు. తక్షణమే వారికి వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ముంబై ఇతర ప్రాంతాల్లో కొందరు హోటల్ యజమానులు తమ హోటల్ ని వినియోగించుకోవాలని ముందుకొచ్చారు.

 


You may also like