‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ సుదీప ప్రేమ పెళ్లి వెనక ఇంత కథ ఉందా?

‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ సుదీప ప్రేమ పెళ్లి వెనక ఇంత కథ ఉందా?

by Anudeep

Ads

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బిగ్ బాస్ 6’ గురించి చర్చలు బాగా జరుగుతున్నాయి. ఈనెల 4వ తారీఖున గ్రాండ్ గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ షో మంచి పాపులారిటీని సంపాదించింది. ఈసారి ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్ బరిలోకి దిగడంతో ఈ షో బాగా ఇంట్రెస్టింగా సాగుతోంది.

Video Advertisement

హౌస్ లో ఉన్న 21 మంది కంటెస్టెంట్స్ లో చాలామంది గురించి మనకు ఇంకా పూర్తిగా తెలియదు. వాళ్లలో బాగా తెలిసిన ముఖాలు ఉన్నాయి అంటే చాలా తక్కువ అని చెప్పాలి. అందులో బాగా తెలిసిన వాళ్లలో సుదీప ఒకరు.

Sudeepa Raparthi Bigg Boss

Sudeepa Raparthi Bigg Boss

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టి పలు చిత్రాల్లో నటించిన సుదీప, ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో పింకీ క్యారెక్టర్ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో సుదీప ఎక్కడికి వెళ్ళినా పింకీగా గుర్తింపు అందుకుంది. ఓ రకంగా చెప్పాలి అంటే అప్పట్లో స్టార్ హీరోలు అందరి సినిమాల్లో సుదీప నటించింది. కానీ ఒక్క నాగార్జునతో మాత్రం నటించలేకపోయాను అని హౌస్ లోకి వెళ్లే ముందు స్టేజిపై ఆమె ప్రస్తావించింది.

తర్వాత సీరియల్స్ లో ఆమె నటిస్తున్న విషయం మనందరికీ తెలుసు. కానీ సుదీప్ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలామందికి తెలియదు. ఆమె తన భర్త శ్రీ రంగనాథ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట్లో వీరి ప్రేమకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. దానితో కలత చెందిన సుదీప ఇంట్లో వాళ్లకి ఓ రేంజ్ లో నాలుగేళ్ల పాటు నరకం చూపించింది. ఎన్ని సంబంధాలు తెచ్చినా ఇష్టం లేదని చెప్పడం దాంతో ఇంట్లో గొడవలు జరగడం రోజువారి వ్యవహారంగా మారిపోయింది. అంతేకాదండోయ్ గొడవపడితే రెండు మూడు రోజులు సరిగ్గా ఆమె అన్నం కూడా తినేది కాదు. ఫైనల్ గా ఎట్టకేలకు పింకీ పెంకితనం ముందు ఇంట్లో వాళ్ళు సరెండర్ కాక తప్పలేదు. అలా తన ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పిన సందీప నటనను వదులుకోవడం ఇష్టం లేక సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

.


End of Article

You may also like