Home Filmy Adda సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ఇక లేరు..!

సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ఇక లేరు..!

by Anudeep

మూవీ క్రిటిక్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి ఇక లేరు. ఇటీవల చెన్నై రోడ్డు మార్గం లో జరిగిన ప్రమాదం లో మహేష్ కత్తి తీవ్రం గా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన వెంటనే అపోలో ఆసుపత్రి లో చేరారు. గత కొన్ని రోజులు గా అపోలో ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ వచ్చారు..

mahesh

మరో వైపు వైద్యులు ఆయనకు అన్నిరకాల వైద్య సేవలను అందిస్తూ వచ్చారు. ఆయన ప్రాణాలను నిలపడానికి శాయశక్తులా కృషిచేశారు. అయితే పరిస్థితి చేయిదాటిపోయింది. మహేష్ కత్తి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా గూడూరు సమీపం లో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కార్ కి ఆక్సిడెంట్ అయింది.

katti mahesh 2

అయితే.. ఆ సమయం లో మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం తో ఆయన కళ్ళు, తలా, ముక్కుకు తీవ్రం గా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను నెల్లూరు ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి తీవ్రం గా ఉండడం తో అక్కడనుంచి చెన్నై అపోలో కు తరలించారు. ఇటీవలే కత్తి మహేష్ చికిత్స నిమిత్తం జగన్ సర్కార్ 17 లక్షల రూపాయలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత రెండు వారాలుగా చెన్నై అపోలో లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కత్తి మహేష్ పరిస్థితి విషమించి కన్నుమూశారు.

You may also like