Home Filmy Adda Big Boss Season 6: బిగ్ బాస్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే.. వైరల్ అవుతున్న లిస్ట్..!

Big Boss Season 6: బిగ్ బాస్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే.. వైరల్ అవుతున్న లిస్ట్..!

by Anudeep

తెలుగు నాట బిగ్ బాస్ రియాలిటీ షో కి ఓ రేంజ్ లోనే పాపులారిటీ ఉంది. నిన్న మొన్నటి దాకా టివి లోనే సందడి చేసిన బిగ్ బాస్ యూనిట్.. తాజాగా ఓటిటిలో కూడా తన ఎంటర్టైన్మెంట్ ను విస్తరించింది. రీసెంట్ గానే ఓటిటిలో స్టార్ట్ అయిన బిగ్ బాస్ తొలి షో అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ ఓటిటి తొలి సీజన్ లో బిందు మాధవి ఫైనల్స్ కూడా నిలబడి విన్ అయ్యి.. టైటిల్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ షో పై మరింత ఆసక్తి రేకెత్తుతోంది.

మరో వైపు ఐపీఎల్ సందడి అయిపోవచ్చింది. ఐపీఎల్ హడావిడి పూర్తయ్యే టైం కి టివి లో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభం అవుతూ ఉంటుంది. గతేడాది ఐదవ సీజన్ రసవత్తరంగా ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఆరవ ఎపిసోడ్ కి కూడా ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆరవ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సారి స్టార్ యాంకర్ ఉదయభాను, గెటప్ శ్రీను కూడా బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

big boss 6

ఈ క్రమంలో గ్లామరస్ న్యూస్ యాంకర్ ప్లేస్ లో ప్రత్యూష, రోజా లలో ఒకరికి ఛాన్స్ రావచ్చని భావిస్తున్నారు. యాంకర్ శివ, అనిల్ రాథోడ్, మిత్ర శర్మ, నటుడు అజయ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా వీరు కాకుండా నటుడు కృష్ణ, సింగర్ మామ సింగ్, యూట్యూబర్ నిఖిల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా సెలెబ్రిటీలు మాత్రమే కాకుండా.. సామాన్యులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. గతంలో లేని విధంగా బిగ్ బాస్ ఈ సారి సామాన్యులకు కూడా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సెలెక్షన్స్ అయ్యాక సామాన్యులలో ఎవరు పాల్గొంటారో తెలుస్తుంది.

You may also like