Big Boss: ఆ విషయం లో నటరాజ్ మాస్టర్ పొరపాటు చేసారా? అందుకే అలా..?

Big Boss: ఆ విషయం లో నటరాజ్ మాస్టర్ పొరపాటు చేసారా? అందుకే అలా..?

by Anudeep

Ads

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు వేడెక్కుతున్నాయి. కంటెస్టెంట్ లు సైతం హోరా హోరీ గా టాస్క్ గెలవాలని.. మంచి మార్క్స్ కొట్టేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా వెయిట్ తగ్గాల్సి ఉంది. కంటెస్టెంట్స్ ను జంటలు గా విడిపోవాలి అని చెప్పగా.. నటరాజ్ మాస్టర్ తన పార్టనర్ గా లోబో ను ఎంచుకున్నారు.

Video Advertisement

nataraj master

మొట్ట మొదటగా పవర్ రూమ్ యాక్సెస్ ను దక్కించుకున్నప్పటికీ.. పవర్ రూమ్ లో ఛాలెంజ్ ను ఎదుర్కొనేటప్పుడు మాత్రం పొరపాటు చేశారా? అని బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇందులో భాగం గా హమీద, శ్రీ రామ్ చంద్ర జంటను నటరాజ్ మాస్టర్ ఎంచుకున్నారు. అక్కడే ఆయన పొరపాటు చేసారని భావిస్తున్నారు. ఎందుకంటే.. శ్రీ రామ్ చంద్ర గతం లో టాస్క్ లు ఎలా కంప్లీట్ చేసారో నటరాజ్ మాస్టర్ చూసారు. ఛాలెంజ్ గురించి కూడా మాస్టర్ కి బాగా తెలుసు.

nataraj master

ఈగల్స్ టీం లో ఉన్నప్పుడు, కెప్టెన్సీ టాస్క్ టైం లో శ్రీ రామ్ ఎలా ఆడాడో కూడా తెలుసు. ఈ టాస్క్ లో కూడా శ్రీ రామ్ దుమ్ము దులిపేసాడు. మాస్టర్ జంట కంటే ముందే బిగ్ బాస్ డిస్ప్లే లో చెప్పిన వస్తువులని బాస్కెట్ లో వేసేసారు. నటరాజ్ మాస్టర్ పెయిర్ కంటే ముందే స్పూన్స్ ను కూడా వేసేసి శ్రీ రామ్ చంద్ర టాస్క్ ఫినిష్ చేసాడు. దీనితో మాస్టర్ -లోబో పెయిర్ ఓడిపోవాల్సి వచ్చింది. బరువు లో మాస్టర్ జంటది హాఫ్ కేజీ పెరిగింది. మరి ఈ గేమ్ లో వీరు ఎలా ముందుకు వెళ్తారో చూడాల్సి ఉంది.


End of Article

You may also like