బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని  అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బయోపిక్ ద్వారా సుశాంత్ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు…కాయ్‌పోచే, పీకే, రబ్తా, కేదార్‌నాథ్ లాంటి హిట్ చిత్రాల్లో సుశాంత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.సుశాంత్ ఆత్మహత్యకు గల  పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈయన మరణవార్త తెలుసుకున్న అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. నాలుగు రోజుల క్రితం అతని మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1986 జనవరి 21న పట్నాలో సుశాంత్ సింగ్ జన్మించాడు. పలు టీవీ సీరియళ్లలో కూడా నటించారు. 2013లో వచ్చిన ‘కై పో చే’ సినిమాతో బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసారు. సుశాంత్ ఫర్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో సేవా సంస్థ కూడా నిర్వహిస్తున్నాడు.