Ads
ఓటీటీలు అందుబాటులో లేని సమయంలో రిలీజ్ అయిన సినిమాలను చూసి ఎంజాయ్ చేసేవారు. అభిమాన నటుడి సినిమా అయితే రెండు మూడు సార్లు వెళ్ళి చూసేవారు. అందులో నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటివి ఆడియెన్స్ కి గుర్తుండేవి. వాటిలో మిస్టేక్స్ ఉన్నా అంతగా గమనిచేవారు కాదు.
Video Advertisement
కానీ ప్రస్తుత కాలంలో సినిమాలు రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలోకి వస్తున్నాయి. వీటిని ఎక్కువ సార్లు చూసిన నెటిజెన్లు ఆ సినిమాలలోని మిస్టేక్స్ ని గమనించి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దాంతో నెటిజెన్లు ఆ దర్శకుడి పై సటైర్స్ వేయడం కామన్ అయ్యింది. తాజాగా గుంటూరు కారంకి అదే పరిస్థితి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చిన గుంటూరు కారం సినిమాలో నెటిజెన్లు ఒక మిస్టేక్ ని కనిపెట్టారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నెట్టింట్లో సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో యాక్టర్ జయరామ్ నటించాడు. మహేష్ తల్లి రమ్యకృష్ణ భర్త, కొడుకులను విడిచిపెట్టి, రెండో పెళ్లి చేసుకుంటుంది. ఇక జయరామ్ నిత్యం గ్రామోఫోన్ లో పాటలు వింటూ ఒక కిటికీ దగ్గర కూర్చుని చూస్తూ ఉంటారు.
అలా చూస్తున్న తండ్రి పై ఓ సీన్ లో మహేష్ అసహనంతో ఒక మాటను కూడా అంటారు. ఎప్పుడూ ఆ కిటికీ దగ్గర కూర్చొని రోడ్డు వైపే చూస్తుంటాడు. “పోనీ వాళ్ళ ఆవిడ కోసం ఎదురు చూస్తున్నాడా అంటే, హైదరాబాద్ అటు లేదు, ఇటుంది. అటు వైపు ఎందుకు చూస్తున్నాడో ఆ దేవుడికే తెలియాలి” అని అంటాడు. అయితే క్లైమాక్స్ లో మాత్రం మహేష్ తల్లి రమ్యకృష్ణని కారులో ఆ కిటికీ వైపుగానే తీసుకొస్తాడు. కిటికిలో జయరామ్ రమ్యకృష్ణ సారీ కొంగు కారు బయట గాలికి ఎగరడం చూసి, ఎమోషనల్ అవుతారు.
ఇక ఈ విషయాన్ని గమనించిన నెటిజెన్లు నెట్టింట్లో త్రివిక్రమ్ పై కామెంట్స్ చేస్తున్నారు. హీరోతో హైదరాబాద్ కిటికీ వైపు లేదని చెప్పించి, మళ్ళీ అదే వైపు నుండి హైదరాబాద్ లో తల్లి రమ్యకృష్ణను తీసుకురావడం ఏంటని అడుగుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.
Also Read: BHAMAKALAPAM 2 REVIEW : “ప్రియమణి ” నటించిన ఓటీటీ సీక్వెల్ “భామాకలాపం 2” రివ్యూ & రేటింగ్..!
End of Article