Ads
DISCLAIMER: All the information on this article is published by guest author and for general information purpose only. Telugu Adda website or team does not own content / make any warranties about the completeness, reliability and accuracy of this information. Any information you find on this article is strictly at your own risk and the website owners will not be liable for any misrepresentation, inaccuracy, false accusations, losses and/or damages in connection with this article content.
Video Advertisement
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమరశంఖం పూరించింది. ఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు అస్త్రాలు సిద్దం చేసుకుంటోంది. సామాజిక సమీకరణాలు బలంగా పని చేసే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పునాదులపై దెబ్బ కొట్టేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యూత్ లో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకొనేందుకు ప్రకటించిన డిక్లరేషన్ పాజిటివ్ సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసే బీసీ వర్గం కష్టాల పైన ఫోకస్ చేస్తూ..వారికి అండగా నిలుస్తూ..వారి మద్దతు కూడగట్టేందుకు సిద్దం వుతోంది. బీసీ డిక్లేరేషన్ లో అనూహ్య నిర్ణయాలతో ముందకు వస్తోంది.
రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని యోచిస్తోంది. త్వరలో సూర్యాపేటలో బీసీ గర్జన సభను భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. సిద్దరామయ్య చేత బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించేలా ఆలోచన చేస్తోంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ గా ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది. యూత్ డిక్లరేషన్ ప్రియాక ప్రకటించటంతో యువతలో నమ్మకం పెరిగింది. ఇప్పుడు అదే తరహాలో బీసీ డిక్లరేషన్ కు ప్లాన్ చేస్తోంది. తాము ప్రకటించిన తరువాత బీఆర్ఎస్, బీజేపీ ఏం చేసినా బీసీ వర్గాలు నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ తమ మేనిఫెస్టోకు అనుగుణంగా ఏదైనా చెప్పినా తొమ్మిదేళ్ల కాలంలో అమలు చేయని పార్టీగా ఇప్పటికే ముద్ర పడిందని..ఇక నమ్మే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేర్చుతామని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే హామీ ఇస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోలో వెనుకబడిన తరగతుల న్యాయమైన డిమాండ్లను కూడా చేర్చుతామని చెబుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకొంటామని ప్రకటకు సిద్దం అవుతున్నారు. బీసీ మేనిఫెస్టో రూపకల్పన సమయంలో బీసీ సంఘాల ముఖ్యుల అభిప్రాయాలకు విలువ ఇచ్చేలా వారికి భాగస్వామ్యం ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బీసీ కులవృత్తులకు లక్ష సాయం ప్రకటన కూడా మోసపూరితంగా మారుతోంది. కేవలం14 బీసీ కులవృత్తులకే లక్ష సాయం ఇస్తామంటోందని, బీసీ జాబితాలోని 130 కులాలకు ఈ స్కీమ్ ను అమలు చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.
తెలంగాణలో ఎన్నికల్లో గెలవాలంటే బీసీ వర్గాలదే డిసైడింగ్ ఫ్యాక్టర్. దీంతో, గతం కంటే ఎక్కువగా బీసీలకు సీట్లు కేటాయించే ఆలోచన కూడా జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో ఒకటి , రెండు వర్గాలకే ప్రాధాన్యత దక్కుతుందనే అభిప్రాయం బీసీల్లో బలంగా ఉంది. అదే సమయంలో బీజేపీలోనూ అదే తరహాలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఒక్కో వర్గం సమస్యల పైన ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా బీసీలకు 50 శాతం టికెట్లు దిశగా ఆలోచన జరుగుతోంది. బీసీ గణన పైన పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని పార్టీ భావిస్తోంది. బీసీ డిక్లరేషన్ పూర్తయిన తరువాత మహిళలు..రైతుల అంశాల పైన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని భావిస్తోంది.
End of Article