Home Bigg Boss 5 telugu దీప్తి సునయన గురించి హౌస్ లో మాట్లాడిన షన్ను.. మొఖం మాడ్చేసిన సిరి.. అసలేమైందంటే..?

దీప్తి సునయన గురించి హౌస్ లో మాట్లాడిన షన్ను.. మొఖం మాడ్చేసిన సిరి.. అసలేమైందంటే..?

by Anudeep

బిగ్ బాస్ రియాలిటీ షో మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో బిగ్ బాస్ కి సంబంధించిన సందడి ఎక్కువగానే ఉంటోంది. ఆ హౌస్ లో జరుగుతున్న ముచ్చట్ల గురించి కొందరు ట్రోల్స్ చేస్తుంటే.. మరికొందరు సస్పెన్స్ రేకెత్తించేలా కథనాలను అల్లేస్తున్నారు. మరో వైపు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న కొన్ని కాన్వర్సేషన్స్ కూడా ఆసక్తికరంగానే ఉంటున్నాయి.

bigg boss 5 telugu contestant shanmukh words about deepthi sunaina

 

 

నిన్నటి ఎపిసోడ్ లో జెస్సి, ప్రియాంక, సిరి ఓ చోట కూర్చుని మాట్లాడుతూ వున్నారు. ఆ టైంలోనే షన్ను కూడా అక్కడకి వచ్చాడు. ఆ టైం ప్రియాంక జెస్సి ని నాకు ప్రపోజ్ చేయాలి అంటే.. ఎలా చేస్తావ్ అని అడుగుతుంది. దానికి జెస్సి.. నేను నీకు ప్రపోజ్ చేయను.. సిరి కె చేస్తా అంటూ చెప్తాడు. అక్కడే ఉన్న షన్ను నీకు ఏ యాంగిల్ లో నచ్చింది..? అంటూ ప్రశ్నిస్తాడు. దానితో సిరి అవమానం గా ఫీల్ అయినట్లు కనిపిస్తుంది.

bigg boss 5 telugu contestant shanmukh words about deepthi sunaina

దానికి రెస్పాండ్ అయిన జెస్సి.. సునయన ను ఉద్దేశించి.. “అదే ప్రశ్నను నిన్ను అడిగితె ఏం చెప్తావ్..? అంటూ తిరిగి ప్రశ్నించాడు. దానికి బదులిచ్చిన షన్ను నాకు క్యారెక్టర్, గుణం మాత్రమే ముఖ్యం అందం కాదు అంటూ చెప్తాడు. దానితో.. సిరి బాధ పడుతుంది. నాకు క్యారెక్టర్ లేదు కదా.. నాతొ స్నేహం చేయద్దు కదా.. అంటూ బాధపడుతుంది. వాడేదో సరదాగా అన్నాడులే అంటూ జెస్సి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు.

bigg boss 5 telugu contestant shanmukh words about deepthi sunaina

బిగ్ బాస్ హౌస్ లో సిరి మొదటినుంచి షన్ను అంటే ఇంటరెస్ట్ చూపిస్తూనే ఉంది. షన్ను దూరం పెడుతున్నట్లే ఉన్నాడు. ఇంతకీ సిరి షన్ను కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి మైండ్ గేమ్ ఆడుతోందా..? లేక ఇంకేమైనా ఆశిస్తోందా..? అన్నది బిగ్ బాస్ ప్రేక్షకులకి కొంత కన్ఫ్యుజింగ్ గానే ఉంది.

You may also like