“ఫైమా” కి “బిగ్ బాస్” యాజమాన్యం పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా.? రెమ్యూనరేషన్ ఎంతంటే.?

“ఫైమా” కి “బిగ్ బాస్” యాజమాన్యం పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా.? రెమ్యూనరేషన్ ఎంతంటే.?

by Anudeep

Ads

చాలా రోజుల ఎదురుచూపు తర్వాత మళ్లీ బిగ్ బాస్ తెలుగు సీజన్-6 మొదలయ్యింది. ఈ సారి చాలా మందికి తెలిసిన కంటెస్టెంట్స్ ఉన్నారు. జబర్దస్త్ లో వచ్చే చలాకి చంటి కూడా ఈ షోలో పాల్గొన్నారు. అలాగే కొంత మంది సీరియల్ నటులు కూడా ఈ సారి ఉన్నారు. ప్రముఖ నటి అభినయ శ్రీ కూడా ఈసారి కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

Video Advertisement

వీరు మాత్రమే కాకుండా కామన్ మాన్ ఆది రెడ్డి, అలాగే మరికొంత మంది యూట్యూబ్ లో ఫేమస్ అయిన నటులు కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ కూడా చాలా కొత్తగా ఉంది.

Bigg Boss 6 Faima

ఇందులో జబర్దస్త్ కమెడియన్ ఫైమా కూడా పాల్గొన్నారు. గత కొద్ది సంవత్సరాల నుండి ఫైమా జబర్దస్త్ ప్రోగ్రాంలో వస్తున్నారు. తన కామెడీ టైమింగ్ తో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు షో యాజమాన్యం ఫైమాకి ఒక కండిషన్ పెట్టినట్టు సమాచారం. అదేంటంటే షోలో ఫైమా ఒకరితో క్లోజ్ గా ఉండాలి అని, అప్పుడే ఆమె హౌస్ లో ఎక్కువ కాలం ఉండగలదు అని అన్నారు అని వార్తలు వస్తున్నాయి. అలాగే పాత జబర్దస్త్ కంటెస్టెంట్స్ గురించి కూడా మాట్లాడాలి అని చెప్పారట. ఇంక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులర్ అయిన ఫైమాకి వారానికి 50 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


End of Article

You may also like