Home Bigg Boss 6 telugu “నన్ను బాగా టార్చర్ చేసే వాళ్ళు..!” అంటూ… “నేహా చౌదరి” ఎమోషనల్ కామెంట్స్..!

“నన్ను బాగా టార్చర్ చేసే వాళ్ళు..!” అంటూ… “నేహా చౌదరి” ఎమోషనల్ కామెంట్స్..!

by Anudeep

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు సీజన్ 6 ఆదివారం గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఈ సారి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. ఆడియన్స్ కి వినోదం పంచేందుకు సిద్ధం అయిపోయారు.

బిగ్ బాస్ అభిమానుల అంచనాలు తగ్గకుండా మొదటి రోజు నుంచే హౌస్ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ సారి హౌస్ లోకి 11 మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళలో యాంకర్ నేహా చౌదరి ఒకరు.

anchor neha about her childhood memories
నేహా చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ముఖ్యంగా తెలుగు ఐపీయల్ చూసే వారికి నేహా గురించి ఎక్కువగా తెలుస్తుంది. యాంకర్గా సత్తా చాటుతున్న నేహా మంచి డాన్సర్ కూడా.

తిరుపతికి చెందిన నేహా సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన యువతి. చదువు పూర్తయ్యాక కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన నేహా… మహా న్యూస్, ఎన్ టీవీ, వనిత టీవీ, హెచ్ ఎం టీవీ, స్టార్ మ్యూజిక్ ఛానల్స్ లో పని చేసింది. ఐపీఎల్ ప్రేక్షకులకు ఈమె బాగా తెలుసు అనే చెప్పాలి.ఇదిలా ఉండగా.. ఈమె బిగ్ బాస్ కు వెళ్లే ముందు ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

anchor neha about her childhood memories
అందులో భాగంగా కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసింది నేహా “నేను చాలా చిన్న వయసులోనే చాలా ఫాస్ట్‌గా జిమ్నాస్టిక్స్‌ నేర్చుకున్నా. సీనియర్స్‌తో కూడా పోటీ పడేదాన్ని. నా కోచ్‌ కూడా ప్రాక్టీస్‌ చేయించేప్పుడు నా సీనియర్స్‌తో చేయించేవారు. చదువు కునే రోజుల్లో సీనియర్లు ర్యాగింగ్‌ పేరుతో నన్ను ఘోరంగా టార్చర్‌ చేసేవాళ్ళు.

anchor neha about her childhood memories

ఏదైనా ఈవెంట్‌ కోసం ట్రావెలింగ్‌ చేస్తున్న టైంలో కూడా నన్ను ఏడిపించేవారు. నాకిప్పటికీ గుర్తు…. నేను ట్రైన్‌లో అప్పర్ బెర్త్ లో పడుకుని ఉంటే.. కిందనుంచి పిన్నీసులతో, పుల్లలతో గుచ్చేవాళ్లు. నాకు బాగా ఏడుపొచ్చేది.ఆ టైంలో నాకు ట్రైన్ లో నుండి దూకేద్దాం అనుకునేదాన్ని. మా అమ్మతో మాత్రం చెప్పేదాన్ని కాదు. కానీ చాలా సార్లు చెప్పాలనిపించేది” అంటూ చెప్పుకొచ్చింది నేహా.

You may also like