బిగ్‌బాస్ తెలుగు-7 ప్రోమో విడుదల..! ఈసారి ఊచకోతే అంటున్న ఫ్యాన్స్..!

బిగ్‌బాస్ తెలుగు-7 ప్రోమో విడుదల..! ఈసారి ఊచకోతే అంటున్న ఫ్యాన్స్..!

by Mohana Priya

Ads

తెలుగు బుల్లితెర రియాలిటీ షో లతో ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. ఎన్ని షోలు ఉన్నప్పటికీ బిగ్ బాస్ రియాల్టీ షో అన్నిటికీ గాడ్ ఫాదర్ లాంటిది. ఈ షో కి ఉన్న క్రేజ్ మరి ఏ షో కి లేదు అనడం అతిశయోక్తి కాదు.

Video Advertisement

ఇప్పటివరకు 6 సీజన్లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో 7 వ సీజన్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. స్టార్ మా చానల్ ఎంతో ప్రెస్టేజ్ గా భావించే బిగ్ బాస్ షో యొక్క సీజన్ 7 ప్రోమో విడుదల చేయడం జరిగింది.

big-boss-7

అయితే బిగ్ బాస్ సీజన్ 6 ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త తడబడింది. దీని కారణంగా నెక్స్ట్ సీజన్ ఉంటుందా ఉండదా అన్న అనుమానం చాలామందికి కలిగింది. అనవసరంగా సాగదీసినట్టుగా ఉండడం, ఏదో ప్లాన్ చేసినట్టుగా గొడవలు మరియు కాస్త అభ్యంతరకరమైనటువంటి ప్రవర్తనను కనబరిచే కొందరు అభ్యర్థులు ఇలా సీజన్ 6 లో చాలా లోపాలే ఉన్నాయి.

అయితే రీసెంట్ గా..రెడీగా ఉండండి…త్వరలో మిమ్మల్ని ఎమోషనల్ ఎత్తుపల్లాలతో ఉర్రూతలూగించడానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మీ ముందుకు వచ్చేస్తోంది…. అని స్టార్ మా ఛానల్ వెల్లడించడంతో బిగ్ బాస్ అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు.రాబోయే ఈ సీజన్ థ్రిల్లింగ్ మూమెంట్స్ మరియు ఛాలెంజెస్ తో ఓ సరికొత్త రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు.

సిల్లీ ఫైట్స్ దగ్గర నుంచి హృదయాలను బరువెక్కించే గాధల వరకు.. ఒక సంపూర్ణమైన వినోదం ప్యాకేజీల గ్యారెంటీగా అందిస్తామని హామీ ఇస్తున్నట్లు వివరించారు. ఇంతకుముందు సీజన్‌లో జరిగినటువంటి పొరపాట్లు ఈ సీజన్‌లో జరగకుండా ఉంటే బాగుంటుంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్ ని కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం బిగ్ బాస్ లవర్స్ అందరూ షో ని ఎంజాయ్ చేయడానికి సిద్ధం కండి.

watch video :


End of Article

You may also like