బిగ్‌బాస్ తెలుగు-6 కంటెస్టెంట్స్ “రెమ్యూనరేషన్” ఎంతో తెలుసా..? అందరికంటే ఎక్కువ ఎవరికంటే..?

బిగ్‌బాస్ తెలుగు-6 కంటెస్టెంట్స్ “రెమ్యూనరేషన్” ఎంతో తెలుసా..? అందరికంటే ఎక్కువ ఎవరికంటే..?

by Anudeep

Ads

బిగ్ బాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సీజన్ 6 సెప్టెంబర్ 4 న అందరి ముందుకు వచ్చేసింది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లను హోస్ట్ నాగార్జున హౌస్ లోకి పంపించారు.

Video Advertisement

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన బిగ్ బాస్ సెట్లో వారంతా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడపడానికి, వీక్షకులకు వినోదం అందించడానికి సిద్ధమయ్యారు. హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ వివరాలు ఇంటర్నెట్లో హల చల్ చేస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం..

# సింగర్ రేవంత్

ఇండియన్ ఐడల్ విజేత అయిన సింగర్ రేవంత్ బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు గాను అత్యధికంగా వారానికి 60,000 తీసుకుంటున్నట్లు సమాచారం.

biggboss contestents remunirtion details
# చలాకీ చంటి

టాలీవుడ్ కమెడియన్‌లలో ఒకరైన చలాకి చంటి బిగ్ బాస్ కు రాక ముందు కామెడీ షో లలో నటించాడు. బిగ్ బాస్ షోలో వారానికి రూ.50 వేలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

chalaki chanti BigG Boss

# శ్రీహన్

గత సీజన్లో కంటెస్టెంట్ అయినా సిరి బాయ్ ఫ్రెండ్ గా పాపులర్ అయిన శ్రీహన్ ఒక మోడల్, టీవీ నటుడు. అతడు కూడా వారానికి రూ.50 వేలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

bigg boss telugu 6 final contestants list

# బాలాదిత్య

బాల నటుడిగా నటించి హీరోగా మారిన బాలాదిత్య అనేక షోలకు హోస్ట్ గా వ్యవహరించాడు. చాలా కాలంగా ప్రేక్షకుల ముందుకు రాని బాలాదిత్య బిగ్ బాస్ వంటి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ షోలో పాల్గొన్నందుకు బాలాదిత్య వారానికి రూ.45 వేలు వసూలు చేస్తున్నాడు.

biggboss contestents remunirtion details
# రోహిత్

తన భార్య మెరీనా తో కలిసి జంటగా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన రోహిత్ ఒక మోడల్, టీవీ నటుడు ఇతడు కూడా వారానికి వారానికి రూ.45 వేలు తీసుకుంటున్నాడు.

Bigg Boss 6 Telugu Sri Rohit

# ఆర్జే సూర్య

మిమిక్రి ఆర్టిస్ట్, కమెడియన్ అయిన ఆర్జే సూర్య వారానికి రూ. 40,000 తీసుకుంటున్నారు.

biggboss contestents remunirtion details
# మెరీనా అబ్రహం

టీవీ నటి మెరీనా, తన భర్త రోహిత్‌తో కలిసి ఇంట్లో కి ప్రవేశించారు. అందుకు గాను వారానికి రూ.35 వేలు తీసుకుంటున్నారు.

biggboss contestents remunirtion details
# శ్రీ సత్య

మోడల్ నుంచి నటిగా మారిన శ్రీ సత్య వారానికి రూ.30 వేలు తీసుకుంటున్నారు.

biggboss sri satya acted in nenu sailaja movie

# షైనీ సాల్మన్

రాజమౌళి ‘సై’ సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ షైనీ సాల్మన్ హౌస్ లో ఉన్నందుకు గాను వారానికి రూ.30 వేలు తీసుకుంటున్నారు.

Bigg Boss 6 Telugu Shaani Salmon

# ఆది రెడ్డి

పబ్లిక్ నుండి సక్సెస్ ఫుల్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న ఆది రెడ్డి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో చేరాడు. అతనికి రెమ్యునరేషన్ కింద రూ. 30,000 చెల్లిస్తున్నారు.

Adi Reddy BIGG BOSS

# సుదీప

నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో పింకీ పాత్ర ద్వారా మనల్ని అలరించారు సుదీప. తర్వాత కొన్ని సీరియల్స్ చేసి నటనకు దూరమయ్యారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు వారానికి 25,000 రూపాయలు తీసుకుంటున్నారు.

biggboss contestents remunirtion details
# ఫైమా

జబర్దస్త్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న ఫైమా బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు వారానికి 25,000 రూపాయలు తీసుకుంటున్నారు.

# గీతూ రాయల్

చిత్తూరు యాసలో ఇంస్టా ఇన్ఫ్లుయెన్సర్ గా దూసుకుపోతున్న గీతూ రాయల్ హౌస్ లో ఉండేందుకు వారానికి 25,000 రూపాయలు తీసుకుంటున్నారు.

audience fire on biggboss show..know why

# వాసంతి

సంపూర్ణేష్ బాబు చిత్రం ‘కాలీఫ్లవర్‌’లో కథానాయికగా నటించడంతో వాసంతి పాపులర్ అయ్యారు. తాజాగా సునీల్ హీరోగా విడుదలైన ‘వాంటెడ్ పండుగాడు’ చిత్రం లో కూడా హీరోయిన్ గా నటించారు. బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు వారానికి 25,000 రూపాయలు తీసుకుంటున్నారు.

bigg boss telugu 6 final contestants list

# అర్జున్ కళ్యాణ్

అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన అర్జున్, న్యూయార్క్‌లోని ఫిల్మ్ అకాడమీ నుండి యాక్టింగ్ కోర్స్ ను పూర్తి చేశారు. తర్వాత టాలీవుడ్ లో అడుగు పెట్టి తక్కువ బడ్జెట్ సినిమాల్లో హీరోగా నటించాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు వారానికి రూ.20 వేలు తీసుకుంటున్నాడు

bigg boss telugu 6 final contestants list

# అభినయ శ్రీ

డ్యాన్సర్ అనురాధ కూతురు అయిన అభినయ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ‘అ అంటే అమలాపురం’ పాటతో ఇండస్ట్రీని షేక్ చేసింది. మరికొన్ని తెలుగు చిత్రాలలో కొన్ని పాటలు మరియు పాత్రలు చేసింది. ప్రస్తుతం ఫుల్ టైమ్ యూట్యూబర్‌గా మారి తనదైన ముద్ర వేస్తోంది. ఈమె వారానికి రూ.20 వేలు తీసుకుంటున్నారు.

bigg boss telugu 6 final contestants list

# యాంకర్ నేహా

స్పోర్ట్స్ యాంకర్ గా పని చేస్తున్న నేహా ఐపీఎల్ తో ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఈమె వారానికి రూ.20 వేలు తీసుకుంటున్నారు.

biggboss contestents remunirtion details
# మోడల్ రాజశేఖర్

ఆఫీస్ బాయ్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు రాజశేఖర్. తర్వాత చిన్న మోడలింగ్ అసైన్‌మెంట్‌లను తీసుకున్నాడు. ప్రస్తుతం మోడల్, టీవీ నటుడిగా కొనసాగుతున్నాడు.ఇతడు వారానికి 20 వేలు తీసుకుంటున్నాడు.

Bigg Boss Telugu Raj Shekar

# ఆరోహి రావు

యాంకర్ పని చేస్తున్న ఆరోహి రావు హౌస్ లో ఉన్నందుకు గాను వారానికి 15 వేలు తీసుకుంటున్నారు.

bigg boss telugu 6 final contestants list

# ఇనాయ సుల్తానా

అరియనా గ్లోరీ లాగా ఆర్జీవీ వల్ల పాపులర్ అయ్యి బిగ్ బాస్ కు వచ్చిన వ్యక్తి ఇనాయ సుల్తానా. హౌస్ లో ఉన్నందుకు గాను వారానికి 15 వేలు తీసుకుంటున్నారు.

actress inaya sultana unknown details


End of Article

You may also like