Ads
తెలుగులో రియాల్టీ షో బిగ్ బాస్ కి మంచి ఆదరణ ఉంది. ఇప్పటివరకు ఏడు సీజన్లు ప్రసారమైన ఈ షో కి మంచి టిఆర్పి తో ఆదరణ లభిస్తూ వస్తుంది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండో సీజన్ కి నాని వ్యవహరించారు. అక్కడినుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు.
Video Advertisement
కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీ పోటీతో ఈ షో రోజు రోజుకి ఇంట్రెస్టింగా ఉంటుంది. ప్రతివారం ఎలిమినేషన్ తో ,డిఫరెంట్ టాస్కులతో రసవత్తంగా సాగుతుంది. చాలామంది బిగ్ బాస్ లో జరిగే రచ్చకి విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. అయితే ఈ షో అదేమీ లెక్క లేకుండా విజయవంతంగా సాగుతుంది.
అయితే ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కాంట్రవర్సీకి గురైంది. బిగ్ బాస్ సెవెన్ లో విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు. అయితే ఆయన విజేతగా నిలిచిన అనంతరం జరిగిన ర్యాలీలో పరిణామాలు పోలీస్ కేసుల వరకు వెళ్లాయి. ఆయన అభిమానులు ఆర్టీసీ బస్సు అద్దాలు బద్దలు కొట్టడం, మిగతా కంటిస్టెంట్ల కారులను ధ్వంసం చేయడం వంటివి చేశారు.దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ పైన కేసు నమోదు చేసి చంచల్ గూడా జైలుకి తరలించారు. అనంతరం పలవి ప్రశాంత్ బైల్ పై బయటకు విడుదలయ్యాడు.
అయితే ఇప్పుడు జరిగిన పరిణామాలు బట్టి బిగ్ బాస్ నిర్వాహకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇకపై జరిగే సీజన్లలో విజేత అయిన ఎవరైనా సరే షో అనంతరం ర్యాలీ చేయకుండా ముందుగానే అగ్రిమెంట్ చేయించుకోనున్నట్లు తెలుస్తుంది
End of Article