Ads
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పరిస్థితి పరమ వరస్ట్‌గా మారింది. ఎంటర్ టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ సీజన్ 6తో హంగామా చేసిన హోస్ట్ నాగార్జున కెరియర్‌లోనే వరస్ట్ రికార్డ్స్ నమోయ్యాయన్న విషయం తెల్సిందే.తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజన్ 6 కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా ప్రారంభమైంది.
Video Advertisement
వరుసగా నాగార్జున నాలుగోసారి హోస్ట్ చేసిన.. సీజన్ 6కి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్‌కి పరిమితం అయ్యింది.
ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ లో సూర్య కూడా ఒకడు. అయితే ఆర్జే సూర్య హౌస్ లో గట్టిగ పులిహోర కలుపుతూనే వున్నాడు. ఎవరి నోటా విన్నా అదే వినపడుతోంది. మొదట ఆర్జే సూర్య ఆరోహితో చాల చనువుగా వున్నాడు. ఆమెతో హగ్స్, కిస్సెస్ కూడా చూసేసాం. ఆమె బయటకి వచ్చేసాక సూర్య ఇనయ సుల్తానాతో పులిహోర స్టార్ట్ చేసేసాడు. ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ స్టార్ట్ చేసేసాడు.
ఇలా ఆర్జే సూర్య మన్మధుడిలా మారిపోయాడు. కానీ నిజానికి సూర్య కి బయట ప్రేయసి వుంది. నాగార్జున కూడా ఈ విషయం చెప్పారు. పైగా బుజ్జమ్మ అంటూ పాటలు కూడా వేశారు. అయితే బయట ప్రేయసి ఉండగా.. సూర్య ఇలా చేస్తున్నాడు ఏమిటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే సూర్య ప్రేయసి మాత్రం సూర్య అలాంటి వాడు కాదు అని తెర మీదకి వచ్చేసింది.
ఈమె పేరు మృదుల. ఈమెని బుజ్జమ్మ అంటాడు సూర్య. పదేళ్లుగా వీళ్ళు రిలేషన్ లో ఉన్నారట. ఈమె మాదాపూర్ లో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా టెక్ కంపెనీలో పని చేస్తోందట. అయితే ఈమె మాత్రం సూర్య అలాంటి వాడు కాదు అని పైగా బాగా ఆడుతున్నాడని చెప్పింది. పైగా ప్రతీ ఒక్కరితో మంచి ర్యాపో ఉందని.. అందుకే ఎవరూ నామినేట్ కూడా చేయడం లేదని ఈమె అంది. పైగా సేఫ్ గేమ్ కూడా ఆడడం లేదంది.
End of Article