పెళ్లయ్యింది కానీ జిమ్ ట్రైనర్ తో ప్రేమాయణం.. ఆరోజు వచ్చిన ఒక్క ఫోన్ కాల్ ఎంత పని చేసిందంటే..?

పెళ్లయ్యింది కానీ జిమ్ ట్రైనర్ తో ప్రేమాయణం.. ఆరోజు వచ్చిన ఒక్క ఫోన్ కాల్ ఎంత పని చేసిందంటే..?

by Anudeep

బీహార్ లో జిమ్ ట్రైనర్‌ విక్రమ్ రాజ్‌పుత్‌ పై ఆత్మహత్యం సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులు పోలిసుల విచారణ లో కీలకమైన విషయాలను బయటపెట్టారు. డాక్టర్ రాజీవ్ కు స్నేహితుడైన వికాస్ వీరితో మూడు లక్షలను డీల్ కుదుర్చుకున్నారని చెప్పారు. అతనే ఈ హత్య చేయించాల్సింది గా కోరినట్లు పేర్కొన్నారు.

Video Advertisement

bihar incident 1

విక్రమ్ పై కాల్పులు జరిపామని.. అతని ఒంట్లో ఐదు బుల్లెట్లు దూరాయని.. అయినా అతను మరణించకపోవడం తో.. ఈ డీల్ కోసం మాట్లాడుకున్న డబ్బులలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇది ఇలా ఉంటె.. ఈ ముగ్గురు నిందితులని కాకుండా ఆ డాక్టర్ రాజీవ్ ను, అతని భార్యని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. డాక్టర్ రాజీవ్ భార్య కుష్బూ జిమ్ ట్రైనర్ ను ప్రేమించింది.
bihar incident 2

భర్తకు తెలియకుండా అతనితో సన్నిహితం గా మెలిగేది. వీరి వివాహేతర సంబంధం భర్తకు తెలియకుండా జాగ్రత్త పడింది. పలుసార్లు జిమ్ ట్రైనర్ విక్రమ్ ఇంటికి కూడా వెళ్ళింది. పోలీసులు ఈ కేసును లోతుగా విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. కుష్బూ, విక్రమ్ ల మధ్య దాదాపు 1100 ఫోన్ కాల్స్ నడిచినట్లు గుర్తించారు. ఇవన్నీ ఎక్కువ అర్ధరాత్రి సమయం లోనే ఉండేవి. ప్రతి కాల్ లో కనీసం అరగంట నుంచి 40 నిమిషాల వరకు మాట్లాడుకునే వారు.

bihar incident 3

ఏప్రిల్ 18 న మొదటిసారిగా రాజీవ్ నుంచి విక్రమ్ కు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లోనే విక్రమ్ ను చంపేస్తాను అంటూ రాజీవ్ బెదిరించాడు. ఈ క్రమం లోనే కొందరు దుండగులు విక్రమ్ పై కాల్పులు జరిపి హత్యాయత్నం చేశారు. కదంకౌన్ ప్రాంతం లో కాల్పులు జరిపారు. ఐదు బుల్లెట్లు విక్రమ్ బాడీలోకి చొచ్చుకెళ్లాయి. ప్రస్తుతం విక్రమ్ చికిత్స తీసుకుంటున్నారు. ఆ డాక్టరు భార్య, డాక్టరు రాజీవ్ తనను చంపించడం కోసమే కుట్ర పన్నారన్నారు. మరో వైపు భార్యాభర్తలిద్దరూ విక్రమ్ ఎవరో తమకు తెలియదన్నారు. కానీ ఈ ఫోన్ కాల్ డేటా అందరి బాగోతాన్ని బయటపెట్టింది.


You may also like