“బింబిసార” OTT లోకి వచ్చేది అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

“బింబిసార” OTT లోకి వచ్చేది అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

by Mohana Priya

Ads

ఒకేసారి విడుదల అయిన సినిమాలు, సీతా రామం, బింబిసార, ఇప్పుడు ఒకేసారి ఓటీటీలో కూడా విడుదల కానున్నాయి. అటు మంచి ప్రేమ కథతో తెరకెక్కిన సీతా రామం, ఇటు హిస్టారికల్ కాన్సెప్ట్ తో చిత్రీకరించిన బింబిసార ప్రేక్షకులకి బాగా నచ్చాయి. రెండు సినిమాలు పోటా పోటీగా నడుస్తున్నప్పటికీ, బింబిసార బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గట్టిగానే వసూలు చేస్తుంది.

Video Advertisement

సినిమా విడుదల అయిన నాలుగు రోజులకు సుమారు 34 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. కాగా బింబిసార సినిమా బడ్జెట్ మొత్తం 40 కోట్లు దాటితే…లాభాల వైపే వెళుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా మంచి విజయ బాటలో వెళుతుండగా, జీ 5 ఓటీటీ వారు ఈ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకున్నారు. ఇకపోతే సినిమా మాత్రం థియేటర్లలో నాలుగు వారాలు పూర్తి చేసుకున్న తర్వాతే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.

ఈ సినిమాకి ఎన్టీఆర్ బ్యానర్స్ కింద, కే.హరి కృష్ణ నిర్మాత ఆధ్వర్యంలో మల్లిది వశిష్ఠ దర్వకత్వం వహించారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ లీడ్ రోల్ చెయ్యగా, క్యాథరీన్, సంయుక్తా మీనన్ ముఖ్య పాత్రలు వహించారు. మరోవైపు ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, బ్రాహ్మజీలు కూడా కీలకమైన సపోర్టింగ్ రోల్స్ లో నటించారు.


End of Article

You may also like