చూడటానికి చక్కగా ఉంది..పదహారు అనాలా తెలుగు ఇంటి ఆడ పడుచు లా ఉంది ఎవర్రా ? అని ఆశ్చర్యపోతున్నారా ? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉంది అని అనుకుంటున్నారా ? ఈమె మరెవరో కాదు డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి,బుజ్జి గాడు సినిమాలో త్రిష చిన్ననాటి పాత్ర లో మెరిసిన ఈ అమ్మాయి ఇప్పుడు ఇలా ఉన్నారు.

పూరి జగన్నాధ్ గారి కి ఒక కుమారుడు,కుమార్తె అన్న విషయం అందరికి తెలిసిందే ఆకాష్ పూరి సినిమాలో చేస్తూ ఆల్రెడీ బిజీ అయ్యాడు కూడా.పవిత్ర పూరి కి సినిమా దర్శకత్వం మీద ఆసక్తి అట..ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా మెలకువలు నేర్చుకుంటున్న పవిత్ర భవిష్యత్తు లో దర్శకురాలిగా మారనుందన్న…తండ్రినే స్ఫూర్తిగా తీసుకున్నారు..అందుకే మహిళా దర్శకురాలిగా మెరవాలి అనుకుంటున్నారు.. పూరి జగన్నాధ్ గారు దర్శకత్వం వహించిన ‘పైసా వసూల్ ‘ సినిమా సంబందించిన వ్యవహారాలు అన్ని దగ్గర ఉంది మరీ చూసుకున్నారు.

దర్శకురాలిగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా సినిమా లు చెయ్యాలి అని ఆశ పడుతున్నారు పవిత్ర పూరి.తనకు సంబందించిన కొన్ని ఫోటోలను సామజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ తన అభిరుచులను,భావలనను పంచుకున్నారు పావిత్ర గారు..బెస్ట్ అఫ్ లక్ మరి..తండ్రి కి తగ్గ కూతురిగా పేరు తెచ్చుకోవాలి అని కోరుకుందాం.