తెలుగు లోని ప్రముఖ న్యూస్ ఛానల్ లో ప్రసారం అయ్యే తీన్మార్ వార్తలు అనే ప్రోగ్రాం నుంచి తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు అయిన బిత్తిరి సత్తి..అలియాస్ చేవెళ్ల రవి కుమార్…అటు వెండి తెర మీద కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు..అయితే ఇటీవలే తను పని చేస్తున్న ఛానల్ కి రాజీనామా చెయ్యడం..సంచలన వార్త గా నిలిచింది.అసలు కారణం ఏంటి అని ఆరా తీయగా తెలిసిన నిజం ఏంటంటే.

Video Advertisement

తెలుగు ఛానల్ లో ప్రసారం అయ్యే ‘బిగ్ బాస్ షో’ సీజన్ 4 కోసం..సిద్ధమవుతున్నట్టు గా తెలియ వచ్చింది.ఇప్పటికే చాల మంది పార్టిసిపెంట్స్ ని వెతికే పనిలో ఉన్న నిర్వాహకులు..అందులోని కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి…హీరో తరుణ్,సుడిగాలి సుధీర్..కార్తీక దీపం సీరియల్ ప్రేమి విశ్వనాధ్.తాగుబోతు రమేష్,పేర్లు ప్రచారం లో ఉన్నాయి.బిత్తిరి సత్తి తో పాటు శివ జ్యోతి కూడా తీన్మార్ వార్తలు ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన సంగతి తెలిసిందే.ఇదే ఏడాది ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో బిగ్ బాస్ సీజన్ 4 మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.గతం లో కూడా సీజన్ 1 , సీజన్ 2 లో కూడా పాల్గొనే అవకాశం ఉన్న వెళ్లలేదట..