ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయను అంటూ రాజాసింగ్ సంచలన ప్రకటన..ఎందుకంటే.?

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయను అంటూ రాజాసింగ్ సంచలన ప్రకటన..ఎందుకంటే.?

by Mounika Singaluri

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పూర్తయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బాధ్యతలు స్వీకరించింది. అయితే త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం ఎమ్మెల్యే లందరూ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే తెలంగాణలో ఉండే బిజెపి ఎమ్మెల్యేలు అందరూ ఒక తీరులో ఉంటే గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం మరొక విధంగా ఉంటారు. ఆయన ఎప్పుడూ తన నడవడికతో హైలైట్ అవుతూ ఉంటారు.

Video Advertisement

అయితే ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాసింగ్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను అంటూ ప్రకటించారు. అసలు దీని వెనుక కారణం ఏంటా అని చూస్తే… కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయడానికి ప్రోటెం స్పీకర్ ను నియమిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్ గా ఉండనున్నారు. దీంతో అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్ గా ఉంటే తాను ప్రమాణ స్వీకారం చేయను అంటూ రాజాసింగ్ ప్రకటించారు.

మామూలుగా చూసుకుంటే ఆయనకు ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా ప్రోటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ఉండగా అప్పుడు తాను ప్రమాణ స్వీకారం చేయనని, తర్వాత అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చిన తర్వాతే తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే తరహాలో ఇప్పుడు కూడా స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తానని రాజాసింగ్ ప్రకటించారు.


You may also like

Leave a Comment