Ads
తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కామారెడ్డి. ఒక తెలంగాణ దృష్టినే కాకుండా యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం ఇది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేశారు.
Video Advertisement
ఒకరీకి ఒకరు పోటాపోటీగా ప్రచారాల్లో పాల్గొన్నారు. కెసిఆర్ నెగ్గుతారా, రేవంత్ రెడ్డి నెగ్గుతారా అంటూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. అయితే తెలంగాణ ప్రజలందరికీ షాక్ ఇస్తూ ఇక్కడ ఒక సామాన్యుడు ఎమ్మెల్యేగా నెగ్గాడు. బిజెపి పార్టీ తరఫును కటికరెడ్డి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాడు.
అయితే కెసిఆర్, రేవంత్ రెడ్డి ల ముందు వెంకటరమణారెడ్డి నెగ్గి ఛాన్స్ లేదని అందరూ అన్నారు. అయితే తనకంటూ ఒక స్పెషల్ మేనిఫెస్టోని ఏర్పాటు చేసుకుని తన నియోజకవర్గ కోసం సొంత నిధులు 100 కోట్లు ఖర్చు పెడతానని ప్రజలకు హామీ ఇచ్చాడు. తాను ఇక్కడే ఉంటానని మీ అందరికీ ఏ అవసరం వచ్చినా నేను వెంటనే స్పందిస్తానని ప్రజలకి మాట ఇచ్చి వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకున్నాడు.
కామారెడ్డి ప్రజలు కూడా కేసీఆర్, రేవంత్ రెడ్డి లను కాదని వెంకటరమణారెడ్డి తరఫున నిలబడ్డారు. ఎన్నికల్లో మంచి మెజారిటీ అందించి ఇద్దరు ఉద్దండులను ఓడించి ఎమ్మెల్యేగా వెంకటరమణారెడ్డికి పట్టం కట్టారు. అయితే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తో మంచి అనుబంధం ఉంది. రాజశేఖరరెడ్డి అనుచరుడిగా పేరు కూడా వచ్చింది.
అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతూ… రాజశేఖర్ రెడ్డి 10 మందికి సాయం చేస్తూ, వారిని పైకి తీసుకువస్తూ ఒక నాయకుడిగా ఎదిగారని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ కూడా ప్రతిపక్షమా, విపక్షమా అని చూడకుండా అందరికీ సమానంగా చూసేవారని చెప్పుకొచ్చారు. తను 2004లో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డి తో ఉన్న అనుభవం గుర్తు చేసుకున్నారు.
ఒక రైతు తన పాసుబుక్ కోసం సమతా నిలయానికి వచ్చి గొడవ చేస్తుంటే స్వయంగా రాజశేఖర్ రెడ్డి అతన్ని పిలిపించుకుని మాట్లాడారని, ఏంటా సమస్యని రైతును అడగా… తన కూతురు పెళ్లి ఉందని ఎమ్మార్వో పాస్ బుక్ చేయడం లేదని లంచం అడుగుతున్నారని రైతు విన్నవించుకున్నాడు. పాసుబుక్ కాకపోతే తన పొలం అమ్మలేనని, కూతురు పెళ్లి ఆగిపోతుందని తనకి చావేదిక్కు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు రైతు. వెంటనే ఆ జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి ఎమ్మార్వోకి ఫోన్ కలిపి ఆ రైతు ఇంటికొచ్చే లోపు పాస్ బుక్ అతనికి ఇంటి వద్ద ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
వెంటనే రైతుకి రెండు లక్షల రూపాయలు ఇచ్చి దాంతో కూతురు పెళ్లి చేయాలని పొలం అమ్మవద్దని, అది కొడుకు కోసం అలాగే ఉంచాలని రైతుకి చెప్పారు. మీ ఎమ్మెల్యే, మీ మంత్రి ఎవరో తెలుసా అని అడగగా రైతు తెలియదని చెప్పాడు. రైతును పంపించేసిన తర్వాత ఆ ఎమ్మెల్యే,ఆ మంత్రిని వైయస్ రాజశేఖర్ రెడ్డి చివాట్లు పెట్టారని, ప్రజలకు సేవ చేయండి అయ్యా..! ఇంకెందుకు మీరు ఉన్నది.. అంటూ వారితో చెప్పారని తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు వెంకటరమణారెడ్డి…!
watch video :
End of Article