BOBBY DEOL WIFE: ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ భార్య ఎవరో తెలుసా.? ఎన్ని కోట్ల ఆస్తి ఉందంటే.?

BOBBY DEOL WIFE: ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ భార్య ఎవరో తెలుసా.? ఎన్ని కోట్ల ఆస్తి ఉందంటే.?

by Harika

Ads

ద‌ర్శ‌కుడు సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. హై స్టాండార్డ్స్ తో, భారీ తారాగ‌ణంతో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ. 900 కోట్ల కలెక్షన్స్ సాధించి, 2023 అత్యధిక విజయం సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.

Video Advertisement

అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీలో విలన్ గా నటించిన బాబీ డియోల్ సౌత్ ఇండియాలో కూడా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ గురించి కొత్త పరిచయం అక్కర్లేదు అనుకుంట. అతని భార్య గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

1996లో బాబీ డియోల్ బాబీ తాన్యను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఆమె పారిశ్రామికవేత్త దేవేంద్ర అహుజా కుమార్తె. ఈ జంటకి ఆర్యమాన్ డియోల్, ధరమ్ డియోల్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ప్రస్తుతం వీరు ముంబైలో సుమారు 6 కోట్ల రూపాయల విలువ కల లగ్జరీ భవంతిలో నివసిస్తున్నారు.

దేవేంద్ర అహుజా తాన్యకు 300 కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. తాన్య కూడా తండ్రిలాగే పారిశ్రామికవేత్త. తాన్య ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేసింది. ఆమెకు సొంత ఫర్నిషింగ్ స్టోర్ ఉంది. ఆమె ఆస్తి విలువ రూ. 300 కోట్లు కాగా, బాడీ డియోల్ ఆస్తి విలువ రూ. 66 కోట్లు అని తెలుస్తోంది.


End of Article

You may also like