Home Filmy Adda Vasantha Kokila Review : “బాబీ సింహా” నటించిన వసంత కోకిల అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Vasantha Kokila Review : “బాబీ సింహా” నటించిన వసంత కోకిల అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Anudeep
  • చిత్రం : వసంతకోకిల
  • నటీనటులు : బాబీ సింహా, కశ్మీర పరదేశీ, ఆర్య, రమా ప్రభ
  • నిర్మాత : రేష్మి సిన్హా, రజనీ తల్లూరి, రామ్ తల్లూరి
  • దర్శకత్వం : పురుషోత్తమ రమణన్
  • సంగీతం : రాజేష్ మురుగేశన్
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2023

vasanthakokila telugu-movie-story-review-rating

స్టోరీ :

జాబ్ టెన్షన్స్ నుండి దూరంగా లవర్ తో జాలీ ట్రిప్ కి వెళ్లిన హీరో రుద్రకి ఎదురైన భయానక పరిస్థితుల సమాహారమే వసంత కోకిల. ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్న మారుమూల హోటల్ లో హీరో-హీరోయిన్ దిగుతారు. అప్పటి నుండి వారికి కష్టాలు మొదలవుతాయి. ఆ హోటల్ లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. వారికి ఎదురయ్యే భయానక అనుభవాల వెనుక ఎవరున్నారు? వారిని టార్గెట్ చేసింది ఎవరు..? చివరికి ఆ సమస్యల నుండి హీరో, హీరోయిన్ ఎలా బయటపడ్డారనేది వసంత కోకిల కథ.

vasanthakokila telugu-movie-story-review-rating

రివ్యూ :

విభిన్న పాత్రలు, విలక్షణ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బాబీ సింహా. ‘జిగర్తాండ’, ‘నేరమ్’, ‘మహాన్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన నటించిన వసంత కోకిల’ మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందింది. ఈ చిత్రం లో కథకంటే ఎక్కువగా హీరో పాత్రనే ఫోకస్ చేసారు దర్శకుడు. అలాగే రుద్ర పాత్ర ఈ సినిమాకి ప్రాణం. హీరో హీరోయిన్ ల కెమిస్ట్రీ కూడా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే ఆర్య పాత్ర చివరివరకు ఆసక్తికరంగా సాగుతుంది.

సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. కెమెరా పనితనం కూడా బాగుంది. సినిమాకి తగ్గట్టు సాంకేతిక వర్గం పనిచేసింది. దర్శకుడు తన పరిధి మేరకు మెప్పించాడు.

vasanthakokila telugu-movie-story-review-rating

ప్లస్ పాయింట్స్ :

  • బాక్గ్రౌండ్ మ్యూజిక్
  • స్క్రీన్ ప్లే
  • సినిమాటోగ్రఫీ
  • సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీ
  • రిపీట్ అయ్యే సీన్స్

 

రేటింగ్ :
2 .5 /5

ట్యాగ్ లైన్ :

థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి వసంతకోకిల నచ్చుతుంది.

watch video :

You may also like