“సౌత్ సినిమాలు అందుకే హిట్ అవుతున్నాయి..!” అంటూ… “బాలీవుడ్” హీరోయిన్ కామెంట్స్..!

“సౌత్ సినిమాలు అందుకే హిట్ అవుతున్నాయి..!” అంటూ… “బాలీవుడ్” హీరోయిన్ కామెంట్స్..!

by Anudeep

Ads

పుష్ప ది రైజ్,  ఆర్ఆర్ఆర్ ,  కే.జి.ఎఫ్2 ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేస్తూ ఎంతో విజయం సాధించాయి. మన తెలుగులోనే కాదు, పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యి  మంచి గుర్తింపు సాధించాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబట్టాయి అని తెలిసిన విషయమే.

Video Advertisement

ఈ సినిమాలో సక్సెస్ వల్ల బాలీవుడ్ లో మన సినిమాలకు మంచి క్రేజ్ ఉందని చర్చ జరుగుతుంది. యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన మూడు సినిమాల సక్సెస్  వల్ల మన హీరోల కి ఎంతో క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. ఈ స్టార్ ల మార్కెట్ విలువ కూడా పెరిగిందని చెప్పవచ్చు. మన సౌత్ సినిమాలు నార్త్ ఇండియా థియేటర్లో రిలీజ్ అయితే కలెక్షన్ల వర్షం కురుస్తుందని  థియేటర్ ఓనర్స్ అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పుడు మన సినిమాలు బాలీవుడ్ లో  హిట్ కావడానికి గల కారణం ఇదే అంటూ బాలీవుడ్ నటి రిచా చద్దా ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు. నార్త్ ఇండియాలో సౌత్ సినిమాలు అంచనాలు మించి కలెక్షన్లు సాధించడానికి సౌత్ సినిమా టికెట్ ధరలు, బాలీవుడ్ టికెట్ ధరల కంటే  తక్కువగా ఉండడం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఈ మూడు సినిమాలు బాలీవుడ్ ను మించి కలెక్షన్లు రాబట్టాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బేబీ డాల్ ఆడియో ప్రాజెక్ట్ చేస్తున్నా రిచా చద్దా, తక్కువ టికెట్ ధర తో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతారని, టికెట్ ధర తక్కువగా ఉన్నప్పుడు సినిమా చూడడానికి వాళ్ళకి అంత ఇబ్బందిగా ఉండదని చెప్పుకొచ్చారు.

సౌత్ సినిమా టికెట్ ధరలు 100 నుంచి 400 రూపాయలు ఉండగా, సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ టికెట్ ధరలు 500 రూపాయలు ఉండటంతో ప్రేక్షకులు చూడడానికి ఆసక్తి చూపారు అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

 


End of Article

You may also like